Krishna Kowshik
లావణ్య ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకుంది. కానీ అనుకోకుండా ఆమెకు మరో యువకుడితో వివాహం అయ్యింది. అయితే భర్తకు గర్భిణీ అని తెలియడంతోె..
లావణ్య ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడితోనే జీవితం అనుకుంది. కానీ అనుకోకుండా ఆమెకు మరో యువకుడితో వివాహం అయ్యింది. అయితే భర్తకు గర్భిణీ అని తెలియడంతోె..
Krishna Kowshik
పెళ్లికి ముందే ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడితోనే తన లైఫ్ అనుకుంది. సర్వస్వం అప్పగించింది. కానీ చివరకు ఆమె మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. అంతలో తను గర్భిణీ అని తెలిసింది. ఏం చేయాలో తోచక.. మూడు ముళ్లు వేయించుకుంది. కానీ భర్తకు విషయం తెలిసింది. దీంతో ఆమెను వదిలేశాడు. బిడ్డను చంపుకోలేక అటు భర్తను వదల్లేక పుట్టింటికి వచ్చేసింది. అయితే ఇప్పుడు బిడ్డ లేకుంటే తన సంసారం బాగుంటుందని, భర్త తనను చేరదీస్తాడని నమ్మిన మహిళ..ఓ ఆసుపత్రిని సంప్రదించింది.. కాన్పుతో పాటు బిడ్డను అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయ్యింది.
పెళ్లికి ముందే నెల తప్పిన మహిళ.. పెళ్లయ్యాక భర్తకు తెలియడంతో వదిలేశాడు. దీంతో కడుపులో ఉండగానే ఆ బిడ్డను బేరం పెట్టిందో తల్లి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గర్భిణీకి చేయడంతో పాటు నవ జాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. అయితే లావణ్య పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించింది. అతడితో శారీరకంగా దగ్గరయ్యింది. పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత మహేష్‌ను వివాహం చేసుకుంది.
పెళ్లయిన నెల రోజులకు భర్తకు విషయం తెలిసి నిలదీశాడు. ఆమెను పుట్టింటికి పంపేశాడు. అప్పటి నుండి తల్లి వద్దే ఉంటోంది. అయితే బిడ్డను వద్దనుకోలేకపోయింది. బిడ్డ లేకపోతే భర్త చేరదీస్తాడని నమ్మిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ హాస్పిటల్ నడుపుతున్నారు. అయితే బిడ్డను వేరే వాళ్లకు ఇచ్చేస్తామని, ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలా రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు. ఏప్రిల్ 11న లావణ్య పాపకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో డాక్టర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా ఆ పాపను పిల్లలు లేని రేపాన గ్రామానికి చెందిన భూపతి అప్పగించారు. అయితే భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. డాక్టర్, ఇతర సిబ్బందితోపాటు లావణ్య, మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.