iDreamPost
android-app
ios-app

దారుణం: గుక్కెడు నీళ్ల కోసం కూలీపై ప్రతాపం.. కొట్టి చంపిన ఆకతాయిలు

ఇది ఎండా కాలం కాదు.. .నీళ్లు దొరకని ప్రాంతమూ అంత కన్నా కాదు. కానీ గుక్కెడు నీళ్ల కోసం ఆకతాయిలు అమాయకుడు, వలస కూలిని బలి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోవడం శోఛనీయం. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..?

ఇది ఎండా కాలం కాదు.. .నీళ్లు దొరకని ప్రాంతమూ అంత కన్నా కాదు. కానీ గుక్కెడు నీళ్ల కోసం ఆకతాయిలు అమాయకుడు, వలస కూలిని బలి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోవడం శోఛనీయం. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..?

దారుణం: గుక్కెడు నీళ్ల కోసం కూలీపై ప్రతాపం.. కొట్టి చంపిన ఆకతాయిలు

సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. కానీ నేటి స్వార్థపూరత రోజుల్లో.. నేను బాగుంటే చాలు.. నేను మాత్రమే బాగుండాలన్న ఆశతో బతుకుతున్నాడు సగటు మానవుడు. ఇక సాయం చేయాలన్న ఆలోచన, చింత కూడా ఉండటం లేదు. చివరకు మనిషి ఎలా మారిపోయాడంటే.. గుక్కెడు నీళ్ల కోసం ప్రాణాలు తీసేంత స్థాయికి ఎదిగిపోయాడు. వినడానికే గుజుప్పాకరంగా ఉన్న ఈ ఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటుచేసుకోవడం శోఛనీయం. తాగేందుకు మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన ఓ కూలీని ప్రాణాలు తీశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

బతుకు దెవురు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి బతుకుతున్న వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. కేవలం మంచి నీళ్ల విషయంలో ప్రాణాలు తీశారు.  ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలం బోడగట్టు గ్రామానికి చెందిన సాయిలు (33) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. బీరంగూడలో భార్య మీనా, తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అడ్డా కూలీగా జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గురువారం రాత్రి మియాపూర్ చౌరస్తాలో ఇసుక లారీ వస్తే లోడింగ్ చేసేందుకు మరో ఇద్దరితో కలిసి వెళ్లాడు. తెల్లవారు జామున మరో ఇసుక లారీ రావడంతో దాన్ని అన్ లోడ్ చేసి దగ్గరలో ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.

దాహం వేయడంతో తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లో నీళ్లు పట్టుకునేందుకు ఓ టీస్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న రాజమండ్రికి చెందిన సతీష్.. సాయిలును నీళ్లు పట్టుకోవద్దని హెచ్చరించాడు. దాహం వేస్తుందని, కొన్ని నీళ్లు పట్టుకుంటానని బతిమాలాడాడు. ఇంతలో వారి మధ్య గొడవ జరిగింది. సాయిలను తోసేశాడు సతీష్. దీంతో సాయిలు వారి అడ్డా దగ్గరకు వచ్చి మరోలారీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో సతీష్ వచ్చి.. మరో ఇద్దరితో కలిసి సాయిలుని బలవంతంగా టీ స్టార్ వద్దకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాయిలు .. అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అతడ్ని మియాపూర్ చౌరస్తాలోని లేబర్ అడ్డా వద్ద పడేసి పారిపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.