iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకోమందని నేపాలీ ప్రియురాలిని చంపిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్

పెళ్లి చేసుకోమందని నేపాలీ ప్రియురాలిని చంపిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హత్యలు, అనార్థాల వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి వివాహేతర/అక్రమ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు. ఈ మూడే నేరాలకు కీలకం అవుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. పెళ్లైన వ్యక్తులు భార్యను మభ్యపెడుతూ.. మరో మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పరాయి మహిళ ప్రేమ.. తన స్వలాభం కోసమే.. పెళ్లైందని తెలిసి కూడా ఆ వ్యక్తితో శారీరక సంబంధాన్ని నెరుపుతున్నారు. కొన్నాళ్లు కాపురం చేశాక.. సమాజం, వ్యక్తిగత కారణాలతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను కడతేర్చుతున్నారు. ఆర్మీ అధికారి రామేందు ఉపాధ్యాయ్‌ విషయంలో ఇదే జరిగింది.

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రామేందు.. ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామేందు ఆర్మీ అధికారి. పశ్చిమబెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సిలిగురిలో డ్యాన్స్‌ బార్‌లో నేపాల్‌కు చెందిన శ్రేయ శర్మను కలిశాడు. ఆమెతో స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి జీవించడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత అతడికి డెహ్రడూన్‌లో పోస్టింగ్‌ అయ్యింది. దీంతో శ్రేయను అక్కడకు తీసుకెళ్లాడు. ఆమె గురించి భార్యకు తెలియడంతో తిరిగి సిలిగురి పంపించేశాడు. అయితే ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని ఆమెను తిరిగి తీసుకొచ్చాడు. కలిసి జీవిస్తున్నారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని శ్రేయ ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఆమె పెడుతున్న టార్చర్‌ తట్టుకోలేక చంపేసినట్లు రామేందు ఉపాధ్యాయ్‌ వెల్లడించాడు.

ఈ నెల 9న శ్రేయాను రాజ్‌పూర్‌ రోడ్డులోని ఒక క్లబ్‌కి తీసుకెళ్లి, ఆమెకు మద్యం తాగించి, లాంగ్‌ డ్రైవ్‌కు వెళదామని చెప్పాను. ఆమె అంగీకరించడంతో ఇద్దరం కలిసి ఏకాంత ప్రాంతానికి వెళ్లాం. అనంతరం ఆమె తలపై సుత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఆ మృతదేహాన్నిరోడ్డుపై పడేసి, ఆమె మొహాన్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా.. టాయిలెట్‌​ క్లీనర్‌ను ఆమె ముఖంపై పోసి అక్కడ నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, మొబైల్‌ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా.. లెఫ్టినెంట్‌ కల్నల్‌ రామేందు ఉపాధ్యాయ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్దారించుకున్నారు.