iDreamPost
android-app
ios-app

తాగొచ్చిన తండ్రి.. కూతురు అలా అనే సరికి

నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న, నువ్వు బీరు తాగుడు మానురన్నోలేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న అని చెప్పినా వినకుండా పీకలదాకా తాగుతూ.. అందులోనే జోగుతుంటారు. అయితే ఈ మద్యం మత్తు కుటుంబాల్లో కలహాలను రేపుతోంది.

నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న, నువ్వు బీరు తాగుడు మానురన్నోలేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న అని చెప్పినా వినకుండా పీకలదాకా తాగుతూ.. అందులోనే జోగుతుంటారు. అయితే ఈ మద్యం మత్తు కుటుంబాల్లో కలహాలను రేపుతోంది.

తాగొచ్చిన తండ్రి.. కూతురు అలా అనే సరికి

మద్యం మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. ముఖ్యంగా భార్యా భర్తల మధ్య తగాదాలకు, గొడవలకు కారణమౌతుంది. ఫూటుగా మద్యం సేవించి ప్రతి చిన్న విషయానికి గొడవపడుతుంటాడు భర్త.  సంపాదన మొత్తం తాగుడికే ఖర్చు పెడుతుంటాడు. ఎందుకు తాగొచ్చావని, ఇల్లు గుల్లయ్యిపోతుందని భార్య అడిగినందుకు మత్తులో ఎడా పెడా కొడుతుంటాడు. ఇక అడ్డువచ్చిన పిల్లల్ని సైతం చావబాదుతుంటాడు. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్రాణాలు పోతుంటాయి. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో తండ్రే బిడ్డను చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా, రొంపిచెర్ల మండలంలోని పెద్ద మల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం…

నడింపల్లెకు చెందిన కె మునిరత్నం, రెడ్డెమ్మ దంపతులకు కూతురు గౌతమి ఉంది. తల్లి పదేళ్ల క్రితమే చనిపోగా..అవ్వ మునిరత్నం, తండ్రి దగ్గర జీవిస్తోంది గౌతమి. అయితే మునిరత్నం ఐదు నెలల క్రితమే మరణించింది. గౌతమి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుంది. కాగా, తండ్రితో కలిసి జీవిస్తుండగా.. అతడు రోజు మద్యం తాగొచ్చి ఆమెపై అరిచేవాడు. ఆదివారం కూడా మద్యం సేవించిన మునిరత్నం.. ఇంటికి వచ్చి ఏ పని చేయడం లేదని కూతుర్ని కసురుకున్నాడు. దీంతో ఆమె బదులిచ్చింది. తనకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ సెల్ ఫోన్ చార్జింగ్ వైర్‌ను మెడకు బిగించి చంపేశాడు. అయితే చుట్టుప్రక్కల వారికి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. పోలీసులకు సమాచారం అందగా.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

గౌతమి మృతిపై పలు అనుమానాలకు తలెత్తాయి పోలీసులకు. తండ్రిపై అనుమానంతో ప్రశ్నించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. తండ్రి పరారీలో ఉండటంతో అతడే కుమార్తెను చంపేసి ఉంటాడని భావిస్తున్నారు. కాగా, మరో వాదన వినిపిస్తుంది. సోమవారం ఓ ఆత్మహత్య లేఖ దొరికినట్లు తెలుస్తుంది. అందులో తాను చనిపోతున్నానని, తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన లేఖ బయటపడినట్లు చెబుతున్నారు. ఇదే క్రమంలో తండ్రి ఆమెపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడా అన్న కోణంలో కూడా అనుమానాలు బలపడుతున్నాయి. గౌతమి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. నివేదికలో వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని రెండు రోజుల్లో పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.