iDreamPost
android-app
ios-app

ఈమె మామూలు తల్లి కాదు.. కొడుక్కి ఆ పాఠాలు చెబుతోంది

అమ్మను మించిన దైవం లేదు అంటారు పెద్దలు. తల్లియే పిల్లలకు తొలి గురువు కూడా. తొలి పలుకులు, తొలి అడుగులు నేర్పేది కూడా అమ్మే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లి మాత్రం..

అమ్మను మించిన దైవం లేదు అంటారు పెద్దలు. తల్లియే పిల్లలకు తొలి గురువు కూడా. తొలి పలుకులు, తొలి అడుగులు నేర్పేది కూడా అమ్మే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లి మాత్రం..

ఈమె మామూలు తల్లి కాదు.. కొడుక్కి ఆ పాఠాలు చెబుతోంది

తల్లిని మించిన దైవం, యోధులు లేరంటారు. అలాగే పిల్లలకు తల్లియే తొలి గురువు కూడా. తప్పటడుగులు వేసిన నాటి నుండి తప్పుడు అడుగులు వేస్తున్న చిన్నారుల్ని సరిదిద్ది వారిని సక్రమమైన మార్గంలో నడిపించేంది తల్లి. సమాజంలో ఒక ఉత్తమమైన పౌరుడు లేదా పౌరురాలిగా తీర్చిదిద్దేది అమ్మ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పిల్లలకు విజ్ఞానాన్ని బోధించి, మంచి, చెడులు చెప్పి, ఉత్తమంగా పెంచుతోంది మాతృమూర్తి. తల్లి ఏదీ నేర్పిస్తే అదే నేర్చుకుంటారు పిల్లలు కూడా. అందుకే తల్లి తాను దారి తప్పినా.. పిల్లలు మంచి మార్గాల్లో నడవాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం కొడుకుని వక్రమార్గంలో నడిపించేందుకు శిక్షణ ఇస్తుంది.

తాను చేస్తుందే చెత్త పని. ఇది తన కొడుక్కి కూడా నేర్పించిందో మహా తల్లి. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు ఈ తల్లి కొడుకులు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌కు చెందిన రోజా దొంగతనం చేస్తూ జీవనం సాగిస్తుంది. పక్కా స్కెచ్ వేసి.. ఒంటరిగా ఉన్న మహిళల్ని కాపు కాచి దోచుకెళ్లేది. అంతేనా తన మైనర్ కొడుక్కి కూడా శిక్షణ ఇచ్చేది. నాలుగు రోజులు ఓ ప్రాంతంలో వేచి ఉండి ఏ మహిళలు ఒంటరిగా ఉన్నారో, బంగారం, వెండి, డబ్బు తీసుకెళుతున్నారో చూసేది. అనంతరం సమాచారాన్ని కొడుక్కి అందించేంది. వెంటనే అతడు కూడా కత్తితో వెళ్లి వారిని బెదిరించి, బంగారం, విలువైన వస్తువులను దోచుకెళ్లేవాడు.

ఒక వేళ కొడుకు సమస్యల్లో చిక్కుకుంటే.. వెంటనే ఆమె రంగ ప్రవేశం చేసేది. అలా చాలా మంది దగ్గర డబ్బులు, విలువైన బంగారాన్ని దోచుకెళ్లేవారు. పొలాలకు వెళుతున్న మహిళల్ని, నిర్మానుష్య ప్రాంతంలో సంచరిస్తున్న ఆడ వాళ్లను టార్గెట్ చేసి.. బెదిరించి డబ్బులు, నగలు దోచుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. పలు ఫిర్యాదులు కూడా అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం కాపు కాచి తల్లీ కొడుకులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరి దగ్గర నుండి 103 గ్రాముల బంగారాన్ని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు అని పేర్కొన్నారు. పిల్లల్ని ఉన్నత మార్గాల వైపు పంపాల్సిన తల్లే.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటం గమనార్హం.