iDreamPost
android-app
ios-app

స్పా సెంటర్‌లో ప్రియురాలు పని.. ప్రియుడు ఓయో రూంకు తీసుకెళ్లి..

పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలున్న ఆంటీని ఇష్టపడ్డాడో వ్యక్తి. బతుకు దెరువు కోసం కలకత్తా నుండి బెంగళూరుకు వచ్చిన ఆమెకు అతడు పరిచయం అయ్యాడు. వీరి ప్రేమ, ప్రణయంగా మారింది. అంతలో

పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలున్న ఆంటీని ఇష్టపడ్డాడో వ్యక్తి. బతుకు దెరువు కోసం కలకత్తా నుండి బెంగళూరుకు వచ్చిన ఆమెకు అతడు పరిచయం అయ్యాడు. వీరి ప్రేమ, ప్రణయంగా మారింది. అంతలో

స్పా సెంటర్‌లో ప్రియురాలు పని.. ప్రియుడు ఓయో రూంకు తీసుకెళ్లి..

పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా నుండి బెంగళూరుకు బతుకు దెరువు కోసం వచ్చింది ఓ మహిళ. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. వారి బాధ్యత తనదే కావడంతో ఆ స్పా సెంటర్‌లో పని చేస్తోంది. అంతలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం రిలేషన్ షిప్‌గా మారడానికి ఎంత సేపు పట్టలేదు. ఇది అక్రమ సంబంధానికి దారి తీసింది. ప్రియుడి పుట్టిన రోజు నాడు. ఓ హోటల్ రూంకెళ్లి ఎంజాయ్ చేసింది లవ్ జంట. అనంతరం షాపింగ్, లంచ్ చేశారు మళ్లీ హోటల్ గదికి వచ్చారు. సాయంత్రం పార్కులు, షికార్లు తిరిగారు. ఇదే సరైన సమయమని భావించిన ప్రియుడు ప్రియురాలికి ప్రపోజ్ చేయడమే కాకుండా  తనను పెళ్లి చేసుకోవాలంటూ అడిగాడు. కానీ ఆమె అందుకు తిరస్కరించింది. దీంతో నడి రోడ్డులోనే ప్రియురాలిపై దాడి చేశాడు. అప్పుడే ఓ షాపులో కొన్న కత్తితో 15 సార్లు అత్యంత దారుణంగా పొడవంతో మరణించింది.

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదన్న అకారణంగా ఆమెను హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. గిరీష్ ఎన్ఎల్ అలియాస్ రెహన్ అహ్మద్.. జయ నగర్ వి బ్లాక్‌లోని షాలిని గ్రౌండ్‌లో ప్రియురాలు ఫరీదా ఖతూన్‌ను హత్య చేశాడు. తొలుత పారిపోయి.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు దుర్మార్గుడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..కల కత్తాకు చెందిన ఫరీదా.. ఇద్దరు అమ్మాయిల తల్లి. బెంగళూరులోని యునిసెక్స్ స్పాలో నాలుగేళ్ల నుండి పని చేస్తుంది. స్పేర్ కార్ డ్రైవర్ అయిన గిరీష్.. ఓ సారి ఈ స్పాకు వెళ్లాడు. అప్పుడు ఫరీదాను కలవగా.. పరిచయం.. ప్రణయానికి దారి తీసింది.

సుమారు రెండేళ్ల నుండి ఇద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. గత నెల 6న సొంత గ్రామానికి వెళ్లిన ఫరీదా.. ఓ కూతురితో మార్చి 28న నగరానికి చేరింది.ఆ రోజే గిరీష్ పుట్టిన రోజు కావడంతో.. జయనగర్‌లోని ఓయో హోటల్ రూంకు వెళ్లి పార్టీ చేసుకున్నారు. షాపింగ్, లంచ్, సాయంత్రం పార్కులు, షికార్లు చేశారు. ఆ సమయంలోనే కత్తిని కొనుగోలు చేశాడు. చివరకు వీరిద్దరూ కలిసి షాలిని గ్రౌండ్‌కు వెళ్లారు. అక్కడ ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఫరీదా నిరాకరించింది. దీంతో ఆమెను కొట్టడంతో పాటు వెంట తెచ్చుకునన కత్తితో 15 సార్లు కత్తితో పొడిచాడు. అక్కడే కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఈ సంఘటన చూసి పోలీసులకు సమాచారం అందించాడు.

గిరీష్ హత్య చేసి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెళ్లి చూడగా అప్పటికే ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారైన గిరీష్ కోసం గాలింపు  చర్యలు చేపడుతున్నారు.  రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గిరీష్ జయ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఫరీదాను స్పా పని విడిచి పెట్టి.. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ప్రియుడి గిరీష్ ప్రపోజల్ తిరస్కరించడంతోనే ఆమెను హత్య చేసినట్లు చెప్పాడని పేర్కొన్నారు పోలీసులు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet