iDreamPost
android-app
ios-app

ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కసాయి కూతురు! భర్త ఫిర్యాదుతో..

  • Published Mar 19, 2024 | 11:54 AM Updated Updated Mar 19, 2024 | 11:54 AM

కూతురు పుడితే.. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు ఆ తండ్రి. గుండెలపై పెట్టి పెంచుకున్నాడు. ఓ అయ్య చేతిలో పెట్టాడు. చివరకు ఆ కూతురు..

కూతురు పుడితే.. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయాడు ఆ తండ్రి. గుండెలపై పెట్టి పెంచుకున్నాడు. ఓ అయ్య చేతిలో పెట్టాడు. చివరకు ఆ కూతురు..

  • Published Mar 19, 2024 | 11:54 AMUpdated Mar 19, 2024 | 11:54 AM
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కసాయి కూతురు! భర్త ఫిర్యాదుతో..

మానవ సంబంధాలు రోజు రోజుకు కుంచించుకుపోతున్నాయి. మనుషుల మనస్తత్వాలు నీచాతి నీచంగా దిగజారిపోతున్నాయి. ఆర్థిక మోసాలు, వివాహేతర సంబంధాలు వెరసి.. ఇల్లుగుళ్ల చేసుకోవడమే కాదు, తప్పు అని చెబుతున్న వారిపైనే కక్ష కడుగుతున్నారు కొందరు. ముఖ్యంగా పెళ్లైన పురుషులు, మహిళలు.. పడక సుఖం కోసం అడ్డుగా ఉన్న జీవిత భాగస్వామిని, పిల్లల్ని కడతేర్చుతున్నారు. తాజాగా ప్రియుడి కోసం అల్లారుగా ముద్దుగా పెంచిన కన్న తండ్రినే కానరాని లోకాలకు పంపించిందో కసాయి కూతురు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఏం తెలియని నంగనాచి తుంగబుర్రలా నటిస్తూ.. మొత్తం ప్లాన్ అంతా నడిపింది కూతురు.

ప్రియుడి మోజులో తండ్రినే హత్య చేయించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ములకల చెరువు మండలం సెంట్రల్ స్కూల్ పంచాయతీ పెద్దమొరవపల్లికి చెందిన దయ్యాల రాజారెడ్డికి బ్రాహ్మణి అనే కూతురు ఉంది. ఆయన కోళ్ల ఫారం నడుపుతున్నారు. పెద్ద కూతురైన బ్రాహ్మణీని బాలాజీ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు తండ్రి. అయితే.. ఆమెకు తంబళ్ల పల్లె మండలం, గుండ్ల పల్లి పంచాయితీ, అనగాలవారి పల్లికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో అరుణ్.. ప్రియరాలికి మాయ మాటలు చెప్పి.. నగలు తీసుకున్నాడు. మరోసారి డబ్బులు అడగ్గా.. అతడి మాయలో ఉన్న బ్రాహ్మణి.. మదనపల్లెలో ఉన్న స్థలం తాకట్టు పెట్టి నగదు ఇచ్చింది.

ఈ విషయం తండ్రి రాజారెడ్డికి తెలిసింది. కూతుర్ని మందలించడంతో పాటు మొబైల్ లాక్కున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియుడు అరుణ్ మరో మొబైల్ కొని ఎవ్వరికీ తెలియకుండా ఆమెకు ఇచ్చాడు. అయితే తమ వ్యవహారం తండ్రి, భర్తకు తెలియడంతో పాటు తనను మందలించాడని నాన్నపై కక్ష పెంచుకున్న కూతురు.. చంపేయాలని నిర్ణయించుకుంది. తాజాగా కోళ్ల ఫారం దగ్గర ఉన్న తండ్రి.. లోడ్ పంపించేశాక అలసిపోయి అక్కడే పడుకున్నాడు. కూతురు బ్రాహ్మణి, అల్లుడు బాలాజీ కూడా అక్కడే ఉన్నారు. అయితే ఛాతిలో నొప్పి వస్తోందని టానిక్ తాగాలంటూ భర్తను తీసుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది బ్రాహ్మణి.

అతడు ఒంటరిగా ఉన్నాడని, ఇదే మంచి అవకాశమని, చంపేయాలని చెప్పడంతో ఫారం వద్దకు వెళ్లాడు అరుణ్. అక్కడ ఉన్న గుణపంతో రాజారెడ్డి తలపై కొట్టి చంపాడు. అనంతరం ప్రియురాలికి సమాచారం అందించి.. అక్కడ నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సమాచారాన్ని సేకరించగా.. అల్లుడు బాలాజీ ఫిర్యాదు చేశాడు. అరుణ్ పై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రాహ్మణిని కూడా అరెస్టు చేసి విచారించగా.. నిజాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రియుడి కోసం కన్నతండ్రినే చంపి.. కూతురు అన్న పదానికి మాయని మచ్చలా మారింది బ్రాహ్మణి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet