iDreamPost
android-app
ios-app

ప్రియురాలు బ్రేకప్‌ చెబితే తట్టుకోలేకపోయాడు.. పక్కా ప్లాన్‌తో..

ప్రియురాలు బ్రేకప్‌ చెబితే తట్టుకోలేకపోయాడు.. పక్కా ప్లాన్‌తో..

 ఈ మధ్య కాలంలో బ్రేకప్‌ చెప్పుకోవటం అన్నది టీ,బిస్కట్‌ తిన్నంత ఈజీ అయిపోయింది. ఎదుటి వ్యక్తి ప్రవర్తన కొంచెం ఇబ్బంది కలిగించినా సరే బ్రేకప్‌ చెప్పేస్తున్నారు. అయితే, ఈ బ్రేకప్‌ ఇద్దరికీ ఆమోద యోగ్యంగా ఉంటే పర్లేదు. బ్రేకప్‌ కారణంగా ఎవరో ఒకరు బాధపడాల్సి వస్తే మాత్రం.. అది దారుణాలకు తెరతీస్తోంది. తాజాగా, ఓ యువకుడు తనకు బ్రేకప్‌ చెప్పిన ప్రియురాలిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్‌తో ఆమెను కిడ్నాప్‌ చేయాలని అనుకున్నాడు. సరిగ్గా కిడ్నాప్‌ చేసే సమయంలో ఏమైందంటే..

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని చెన్నై, తిరువాన్‌మియుర్‌కు చెందిన పవిత్ర, ప్రశాంత్‌ ప్రేమించుకున్నారు. అన్ని ప్రేమ జంటల్లానే కలిసి సినిమాలు, షికార్లకు వెళ్లారు. అయితే, ప్రశాంత్‌ ప్రవర్తన కారణంగా పవిత్రకు ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తేవి. రోజు రోజుకు అతడి ప్రవర్తన దారుణంగా మారుతుండటంతో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అతడికి బ్రేకప్‌ చెప్పింది. కలిసి ఉండటం కుదరదని తెగేసి చెప్పింది. అయితే, ఈ బ్రేకప్‌ ప్రశాంత్‌ తట్టుకోలేపోయాడు. ఎలాగైనా ఆమెను తన దాన్ని చేసుకోవాలనుకున్నాడు. ఆమెను కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ఇందుకోసం ఓ ప్లాన్‌ వేశాడు. ఓ కాల్‌ టాక్సీ డ్రైవర్‌ను తన ప్లాన్‌లో భాగం చేసుకున్నాడు. ఇద్దరూ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారు. పవిత్ర డ్యూటీ అయిపోయి.. ఇంటికి వెళ్లిపోయే సమయంలో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి పోదాం అనుకున్నారు. ఆ రోజు సాయంత్రం పవిత్ర డ్యూటీ అయిపోయిన తర్వాత ఆఫీస్‌ బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆమెతో పాటు తల్లి కూడా ఉంది. తల్లితో పాటు ఆఫీస్‌ బయటకు నడుచుకుంటూ వస్తున్న పవిత్రను ఆ ఇద్దరు బలవంతంగా తమ కారులో ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె తల్లి గట్టిగా అరవటంతో జనం చుట్టూ మూగారు.

దీంతో ఆ ఇద్దరు పవిత్రను వదిలేశారు. తమను తాము వారినుంచి తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కత్తితో బెదిరించసాగారు. పవిత్ర తల్లి ఇద్దరిలో ఒకర్ని పట్టుకోవటానికి ప్రయత్నించగా ఆమెకు కత్తిగాయాలు అయ్యాయి. చివరకు ప్రశాంత్‌ వారినుంచి తప్పించుకుని పారిపోగా.. టాక్సీ డ్రైవర్‌ దొరికిపోయాడు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరి, బ్రేకప్‌ చెప్పిన ప్రియురాలిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన ప్రశాంత్‌ ఉదంతం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.