iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: 3వ తరగతి బాలిక కేసులో బిగ్ ట్విస్ట్.. నదిలో పడేయలేదా?

Unexpected Twist In Muchumarri Girl Case: ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికను హత్యాచారం చేసిన తర్వాత మొదట కృష్ణానదిలో పడేశామని చెప్పిన బాలురు.. ఇప్పుడు నదిలో పడేయలేదని చెబుతున్నారు. మరి బాలిక మృతదేహం ఏమైనట్టు?

Unexpected Twist In Muchumarri Girl Case: ముచ్చుమర్రి బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలికను హత్యాచారం చేసిన తర్వాత మొదట కృష్ణానదిలో పడేశామని చెప్పిన బాలురు.. ఇప్పుడు నదిలో పడేయలేదని చెబుతున్నారు. మరి బాలిక మృతదేహం ఏమైనట్టు?

బ్రేకింగ్: 3వ తరగతి బాలిక కేసులో బిగ్ ట్విస్ట్.. నదిలో పడేయలేదా?

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో పగిడ్యాల మండలంలో ఉన్న ఎల్లాల గ్రామంలో 3వ తరగతి బాలికను 7వ తరగతి చదువుతున్న బాలురు హత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. జూలై 7న ఆడుకోడానికి స్నేహితులతో కలిసి ముచ్చుమర్రిలో ఉన్న పార్క్ కి వెళ్ళింది. అయితే పార్క్ లో ఒంటరిగా ఆడుకుంటున్న బాలికని ముగ్గురు బాలురు వచ్చి కాలువ వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఎక్కడ ఇంట్లో చెప్తే తాము దొరికిపోతామేమో అన్న భయంతో బాలికని గొంతు నులిమి చంపేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

అనంతరం బాలురుని అదుపులోకి తీసుకుని విచారించగా కృష్ణా నదిలో పడేసినట్లు వెల్లడించారు. పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో బాలిక మృతదేహం ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటన జరిగి 5 రోజులు అవుతున్నా ఇంకా బాలిక ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి నిందితులను విచారించారు. దీంతో నిందితులు నదిలో పడేయలేదని.. ఒక చోట పూడ్చిపెట్టామని వెల్లడించారు. పగిడ్యాల మండలంలోని స్మశానంలో పూడ్చిపెట్టామని చెప్పడంతో పోలీసులు నిందితులను స్పాట్ కి తీసుకెళ్లి వెతికారు. అక్కడ వెతికినప్పటికీ బాలిక మృతదేహం లభించలేదు. దీంతో నిందితులు మరో స్పాట్ చూపించగా అక్కడికి వెళ్లి వెతికారు.

నిందితులు ఎక్కడ పూడ్చిపెట్టారో కరెక్ట్ గా చెప్పడం లేదో లేక చెప్పలేకపోతున్నారో గానీ వాళ్ళు చెప్పిన చోట మాత్రం బాలిక మృతదేహం కనబడడం లేదు. ముచ్చుమర్రి శివారు ప్రాంతంలో ఒక ప్రదేశంలో జేసీబీతో చెట్లను తొలగించారు. నిందితులు చూపించిన రెండు ప్రదేశాల్లో చెట్లను తొలగించారు. గుబురు ప్రాంతంలో చెట్ల దగ్గర ఏమైనా పూడ్చి ఉండవచ్చునన్న ఉద్దేశంతో జేసీబీతో చెట్లను తొలగించారు. అయినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ముచ్చుమర్రి, పగిడ్యాల, కొణిదెల గ్రామాల్లో నిందితులకు పోలీసులు ముసుగు వేసి తిప్పుతున్నారు. ఎక్కడ పాతిపెట్టారో.. పాతిపెట్టిన ప్రదేశాలకు తీసుకెళ్లి బాలిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. మొదట నదిలో పడేశామని.. ఇప్పుడు పూడ్చిపెట్టామని చెబుతున్నారు. దీంతో పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి