iDreamPost
android-app
ios-app

ఉమెన్స్ డే నాడే దారుణం! భర్తపై కోపంతో ప్రియుళ్లతో కలిసి!

ప్రపంచ వ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకుంటున్న వేళ.. ఇప్పుడో సంఘటన కలవరపెడుతోంది. భర్తపై కోపంతో ప్రియుళ్లతో కలిసి దారుణానికి ఒడిగట్టింది. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..?

ప్రపంచ వ్యాప్తంగా ఉమెన్స్ డే జరుపుకుంటున్న వేళ.. ఇప్పుడో సంఘటన కలవరపెడుతోంది. భర్తపై కోపంతో ప్రియుళ్లతో కలిసి దారుణానికి ఒడిగట్టింది. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..?

ఉమెన్స్ డే నాడే దారుణం! భర్తపై కోపంతో ప్రియుళ్లతో కలిసి!

కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగేళ్ల కుమారుడ్ని అత్యంత కిరాతకంగా తల్లి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ అయిన సుచనా సేథ్.. గోవాకు వెళ్లి ఓ హోటల్ రూం తీసుకుని, అక్కడ కుమారుడ్ని హత్య చేసి, ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా..బ్యాగులో కుక్కి తిరిగి కారులో బెంగళూరుకు బయలు దేరిన సమయంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. భర్తపై కోపంతో ఇదంతా చేసినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. మహిళా దినోత్సవం వేళ.. ఓ ఘటన ఆందోళన కలిగిస్తుంది. కడుపున బిడ్డ అని చూడకుండా బిడ్డలను చిత్ర హింసకు గురి చేసింది కసాయి తల్లి. అమ్మతనానికే మాయని మచ్చలా మారిన ఈ సంఘటన కూడా బెంగళూరులో చోటుచేసుకుంది.

భర్తపై కోపంంతో తల్లి తన ప్రేమికుడితో కలిసి పది సంవత్సరాల పాపను విచక్షణా రహితంగా కొట్టి, దాడి చేసిన ఉదంతమిది. వివరాల్లోకి వెళితే.. అయేషాకు 2013లో ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెళ్లైన నాటి నుండి తరచూ ఇద్దరి మధ్య గొడవలు వస్తుండటంతో  వీరు విడాకులు తీసుకున్నారు. తొమిదేళ్ల వివాహ బంధాన్ని పెటాకులు చేసుకుంది ఆయేషా. ఆయేషా తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో సలీం, జాబీర్ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పరుచుకుంది ఆమెకు. వీరితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. భర్త ఇమ్రాన్ పై ఉన్న కోపంతో ఇద్దరు ప్రియుళ్లను మెయిన్ టైన్ చేసేది. ఈ క్రమంలో కూతుర్ని చిత్ర హింసలకు గురి చేసింది. అతడిపై కోపంతో పాపను ఇష్టమొచ్చినట్లు కొరికి.. ఫ్రిజ్ వాటర్ పోసి, పిల్ల ఏడుస్తుంటే రాక్షస ఆనందం పొందింది.

తరచు అయేషా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు ఆమె ప్రియులు సలీం, జాబీర్. ఆ సమయంలో పాపను సిగరెట్‌తో కాల్చి చిత్ర హింసలకు గురి చేశారు. చిన్న పాప అని చూడకుండా దాడి చేసేవారు. ఈ విషయం మీ తండ్రికి చెబితే.. చంపేస్తానంటూ బెదిరించేవారు ఇద్దరు. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి చెప్పలేదు. చివరకు ఆ వేధింపులు తట్టుకోలేక తండ్రికి చెప్పడంతో.. అతడు.. జేజే నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయేషా, ఆమె ప్రేమికులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ప్రియుళ్లు ఆమెను తీవ్రంగా కొట్టేవారని చిన్నారి చెప్పడంతో.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. తల్లిని, ఆమె ప్రేమికుల్ని అదుపులోకి విచారిస్తున్నారు.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis