iDreamPost
android-app
ios-app

బెంగళూరు మహిళా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఆత్మహత్య

  • Published Sep 25, 2024 | 10:00 PM Updated Updated Sep 26, 2024 | 12:25 PM

Maha Lakshmi: బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముక్తిరంజన్ రాయ్ ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Maha Lakshmi: బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముక్తిరంజన్ రాయ్ ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగళూరు మహిళా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఆత్మహత్య

బెంగళూరులో మహాలక్ష్మీ అనే మహిళను 59 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో ఉంచిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఆమె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతకొద్ది రోజులుగా దేశంలో సంచలనం సృష్టిస్తున్న బెంగళురు మహిళా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఈ కేసులో నిందితుడైన ముక్తిరంజన్ రాయ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. మహాలక్ష్మీ హత్య కేసు నిందితుడు ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా గతంలో మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఓ బట్టల షాపులో పని చేసేది.

ఆ షాపులో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం కావడంతో వారి పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఆ వ్యక్తే హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసుల విచారణలో ఆ సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ అని తేలింది. ఈ హత్యలో ఇతనే ప్రధాన నిందితుడిగా పోలీసులు భావించారు. మహాలక్ష్మీ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం ముక్తికి నచ్చక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. కాగా నిందితుడు బెంగాల్-ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ముక్తిరంజన్ రాయ్ ఒడిషాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్య అనంతరం ఒడిషాకు పారిపోయిన ముక్తి రంజన్ రాయ్ ఓ గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు అక్కడ ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహలక్ష్మిని హత్య చేసిన అనంతరం ఒడిశాకు పారిపోయిన నిందితుడి కోసం కర్ణాటక పోలీసులు అక్కడ నాలుగు బృందాలను పంపించారు. ఈ నేపథ్యంలో, నిందితుడు పట్టుబడతానన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసు వివరాలు చూసినట్లైతే.. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహాలక్ష్మి అనే 29 ఏళ్ల మహిళా కుటుంబం మూడు నెలల క్రితమే బెంగళూరు నగరంకి వచ్చింది. వాయలికావల్ పైప్ లైన్ రోడ్డులోని వీరన్న భవన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

అయితే ఆమెకు భర్తతో గొడవలు కావడంతో కొంతకాలంగా వేరే ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే మహాలక్ష్మి నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్ కు గురయ్యారు. ఆ ఇంట్లోని ఫ్రిజ్ నిండా మహాలక్ష్మి శరీర భాగాగాలు కనిపించాయి. ఆ మహిళ శరీరాన్ని దాదాపు 59 ముక్కలుగా చేసి..ఫ్రిజ్ లో కుక్కారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బట్టల దుకాణంలో టీమ్ లీడర్‌గా పనిచేసింది. మహాలక్ష్మిని తరచూ ఒక యువకుడు కలుస్తుండే వాడని స్థానికులు వెల్లడించారు. ఆ యువకుడే హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి అనుమానాలే నిజమయ్యాయి. మహాలక్ష్మిని చంపిన వ్యక్తి ముక్తి రంజన్ రాయ్ తాను ఆత్మహత్య చేసుకున్నాడు.