పేరెంట్స్ కు కారు గిఫ్ట్ ఇద్దామని వెళితే.. యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. ఎందుకంటే?

పండగ వేళ తన తల్లిదండ్రులకు కారు గిఫ్టుగా ఇద్దామని వెళ్లిన యువకుడిని పొట్టన పెట్టుకుంది ఓ గ్యాంగ్. విచక్షణా రహితంగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

పండగ వేళ తన తల్లిదండ్రులకు కారు గిఫ్టుగా ఇద్దామని వెళ్లిన యువకుడిని పొట్టన పెట్టుకుంది ఓ గ్యాంగ్. విచక్షణా రహితంగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ఆవేశం ఎన్నో అనర్ధాలు దారితీస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను తలకిందులు చేస్తాయి. ఒక్కసారిగా లైఫ్ మొత్తం రిస్క్ లో పడుతుంది. క్షణికావేశంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న చిన్ని విషయాలకే ఓపిక కోల్పోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. విచక్షణా రహితంగా దాడులకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారు. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఒకరి కోపం మరో కుటుంబానికి శాపంగా మారుతోంది. ఇదే రీతిలో ముంబైలో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. విజయదశమి పండగ వేళ ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపింది ఓ గ్యాంగ్.

దసరా పండక్కి తల్లిదండ్రులకు కారు గిఫ్టుగా ఇద్దామని వెళ్లిన యువకుడిని కుటుంబ సభ్యుల ముందే ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. ఈ దాడికి గల కారణం ఏంటంటే.. ఆ యువకుడు రాంగ్ సైడ్ లో వాహనాన్ని ఓవర్ టేక్ చేయడేమే. వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో ఆటో డ్రైవర్, అతని అనుచరులు ఆ యువకుడిని కొట్టి చంపారు. మృతి చెందిన యువకుడిని ఆకాష్ మైన్ గా గుర్తించారు పోలీసులు. ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ సంఘటన మలాడ్ ఈస్ట్ (ముంబై)లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు ఆకాశ్ మైన్ ట్రావెల్స్ ఏజెన్సీ యజమాని. వృత్తి రీత్య ఇతడు హైదరాబాద్ లో ఉంటున్నాడు.

దసరాకు తన పేరెంట్స్ కు కారును బహుమతిగా ఇచ్చేందుకు ఆకాశ్ మైన్ దంపతులు ముంబై వెళ్లారు. షోరూమ్ కు వెళ్లే క్రమంలో మలాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో బైక్ పై వెళ్తున్న యువకుడు ఆటో రిక్షాను ఓవర్‌టేక్ చేశాడు. దీంతో ఆటో డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి గొడవకు దారితీసింది. ఆటో రిక్షా డ్రైవర్ తన సహచరులతో కలిసి ఆకాష్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. యువకుడిని తన్నడంతో పాటు పిడిగుద్దులు కురిపించారు. ఆకాష్‌ను రక్షించడానికి అతని తల్లి ప్రయత్నించినప్పుడు ఆమెపై కూడా దాడి జరిగింది.

తన కొడుకుపై దాడి చేయొద్దని తండ్రి వేడుకున్నప్పటికీ ఆ గ్యాంగ్ విడిచిపెట్టలేదు. దాదాపు 9 మంది ఆకాశ్ పై దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఆకాష్ భార్య అతడిని కాపాడేందుకు వెళ్లగా, యువకులు ఆమెను కూడా కొట్టడంతో ఆమెకు గర్భస్రావం జరిగింది. కుటుంబ సభ్యుల ముందే ఆకాశ్ మైన్ ప్రాణాలు తీశారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన అక్టోబర్ 12న జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసి 9 మంది నిందితులను అరెస్టు చేశారు. వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడన్న కారణంతో యువకుడిని ఆటో డ్రైవర్ కొట్టి చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments