Dharani
ఆ యువతి ఎంబీఏ చదువుతుంది. కొన్ని రోజుల్లో చదువు పూర్తి చేసుకుని.. ఉద్యోగం, పెళ్లి అంటూ ఆమె గురించి తల్లి కలలు కంటుంది. కానీ వారి ఆశల్ని అడియాసలు చేస్తూ.. ఆత్మహత్య చేసుకుని.. కన్నతల్లికి తీరని కడుపుకోత మిగిల్చింది ఆ యువతి. ఆ వివరాలు..
ఆ యువతి ఎంబీఏ చదువుతుంది. కొన్ని రోజుల్లో చదువు పూర్తి చేసుకుని.. ఉద్యోగం, పెళ్లి అంటూ ఆమె గురించి తల్లి కలలు కంటుంది. కానీ వారి ఆశల్ని అడియాసలు చేస్తూ.. ఆత్మహత్య చేసుకుని.. కన్నతల్లికి తీరని కడుపుకోత మిగిల్చింది ఆ యువతి. ఆ వివరాలు..
Dharani
విద్య లేని వాడు వింత పశువు అన్నారు.. అంటే అక్షర జ్ఞానం మనిషికి అవసరం.. అదే మనలో ఆలోచన శక్తిని పెంచి.. మనిషి.. పశువులా ప్రవర్తించకుండా అడ్డుకుంటుంది అనే ఉద్దేశంతో పెద్దలు ఈ మాట అన్నారు. కానీ నేటి కాలంలో చదువు అనేది ఖరీదైన వ్యవహారంగా మాత్రమే కాక.. పిల్లలను బలి తీసుకునే అస్త్రంగా మారింది అని చెప్పడానికి కాస్త బాధపడాల్సి వచ్చిన.. ప్రస్తుత పరిస్థితి మాత్రమే అలానే ఉంది. నేటి కాలంలో నార్మల్ చదువులు సరిపోవడం లేదు.. ఐఐటీ, మెడిసిన్.. ఇవే చదువులుగా మారాయి. ఇక ఒక్కసారి ఫెయిల్ అయ్యామంటే.. జీవితం వేస్ట్ అనే అభిప్రాయానికి వస్తున్నారంటే.. పిల్లల మీద చదువు పేరుతో ఎంత ఒత్తడి తెస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇక గత కొంత కాలంగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక తాజాగా ఏపీలో ఈ తరహా దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. ఎంబీఏ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యకు పాల్పడింది. కారణం.. ఫెయిల్ కావడం. ఆత్మహత్యకు పాల్పడిన సదరు విద్యార్థిని.. అమ్మా.. నేను ఫెయిల్ అయ్యాను. ఈ విషయం మీతో చెప్పలేక.. మిమ్మల్ని ఫేస్ చేయలేక నాలో నేను నలిగిపోతున్నాను. మీకు చెప్పాలంటే భయమేస్తుంది.. అందుకే చనిపోతున్నాను అంటూ సూసైడ్ నోట్ రాసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని దమ్మలవీధిలో నివాసముంటున్న మండా రమణమ్మకు ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె పద్మలతకు కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. ప్రస్తుతం ఆమె బీసీ హాస్టల్‌లో కుక్‌గా పని చేస్తోంది. ఇక రమణమ్మ చిన్న కుమార్తె పేరు ఝాన్సీ(24). తను ఎచ్చెర్లలోని శివాని కాలేజీలో ఎంబీఏ చదువుతోంది.
ప్రస్తుతం వీళ్లంతా కలిసి ఒకే చోట నివాసం ఉంటున్నారు. ఇక శుక్రవారం రాత్రి రమణమ్మ, పద్మలత శరంగడల్ వీధిలో జరుగుతున్న అయ్యప్ప స్వామి భజనకు వెళ్లారు. ఆ సమయంలో ఝాన్సీ, ఆమె అక్క పద్మలత పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇక తల్లి, అక్క బయటకు వెళ్లగానే ఝాన్సీ.. ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. దాంతో పద్మలత పిల్లలు భయపడి.. పక్కింటి వారి ఫోన్ తీసుకుని.. తల్లికి విషయం చెప్పారు. దాంతో పద్మలత, రమణమ్మ వెంటనే ఇంటికి వచ్చారు. ఝాన్సీ ఉన్న గది తలుపులు కొట్టగా.. ఆవైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు.
దాంతో.. తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే ఝాన్సీ ప్యాన్ హుక్‌కి చున్నీతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఝాన్సీని కిందకు దించి చూసేసరికి.. అప్పటికే ఆమె మృతి చెందింది. ఇక పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద సూసైడ్ నోట్ గుర్తించారు ఝాన్సీ తల్లి. దాన్ని ఒపెన్ చేసి చూడగా.. ‘‘అమ్మా.. ఫస్టియర్ ఫస్ట్ సెమ్‌లో నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. నా స్నేహితులందరూ పాస్ అయ్యారు. చాలా రోజుల క్రితమే రిజల్ట్ వచ్చింది. నేను ఫెయిలైన విషయం మీకు తెలిశాక మిమ్మల్ని ఫేస్ చేయలేను. మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయం మీకు చెప్పలేక నాలో నేను కుమిలిపోతున్నాను. నాకు భయంగా ఉంది.. అందుకే చనిపోతున్నాను.. సారీ అమ్మ’’ అని రాసుకొచ్చింది.
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి.. ఆరా తీశారు. ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని ప్రశ్నించగా.. లేదని తెలిపారు. తమ కుమార్తె చాలా సరదాగా ఉండేదని.. చదువు గురించి కూడా తాము ఎప్పుడు తనను ఇబ్బంది పెట్టలేదని.. అలాంటిది తమ కుమార్తె ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఏమాత్రం ఊహించలేదని వాపోయింది ఝాన్సీ తల్లి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఝాన్సీ మృతి పట్ల స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.