Dharani
ఆ తండ్రి బిడ్డ మీదనే ప్రాణాలు పెట్టుకున్నాడు. కానీ కుమార్తె మాత్రం తండ్రి తన దారికి అడ్డు అని భావించి.. అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ వివరాలు..
ఆ తండ్రి బిడ్డ మీదనే ప్రాణాలు పెట్టుకున్నాడు. కానీ కుమార్తె మాత్రం తండ్రి తన దారికి అడ్డు అని భావించి.. అతడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ వివరాలు..
Dharani
సాధారణంగా ఆడపిల్లలకు తండ్రి అంటే ఎంతో ప్రేమ. కుమార్తెకు నాన్నే ఫస్ట్ హీరో, బెస్ట్ ఫ్రెండ్ కూడా. అమ్మతో కన్నా నాన్న దగ్గరగా చనువుగా ఉండి.. ప్రతి సమస్యను తండ్రితో చెప్పుకునే ఆడపిల్లలు మన సమాజంలో ఎందరో ఉన్నారు. ఇక తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు. ఎవరి మాట వినని వ్యక్తి అయినా.. కుమార్తె కోసం తగ్గుతాడు. ఆమె సంతోషం కోసం ఏ త్యాగానికి అయినా రెడీ అవుతాడు. తండ్రీకూతుళ్ల మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. కానీ అక్కడక్కడా కొందరు రాక్షస తండ్రులు, బిడ్డలు తారసపడుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. బిడ్డ మీదనే ప్రాణాలు పెట్టుకున్నాడు ఆ తండ్రి. కానీ కుమార్తె మాత్రం.. నాన్న తన దారికి అడ్డుగా ఉన్నాడని భావించి.. ఏకంగా అతడిని హత్య చేసింది. అది కూడా తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి. ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ జిలలా, అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో బుధవారం నాడు వెలుగు చూసింది. ఎగువ కురవంగ ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికమ్ కాలనీలో దొరస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానిక జీఆర్‌టీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ.. ఎంతో మంచివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరస్వామి భార్య స్నేహ. ఏడాదిన్నర క్రితం ఆమె చనిపోయింది. వీరికి హరిత అనే పాతికేళ్ల కుమార్తె ఉంది. భార్య చనిపోయిన నాటి నుంచి దొరస్వామే కుమార్తె హరిత ఆలనాపాలన చూసుకుంటున్నాడు. హరిత కూడా బీఎస్సీ బీఈడీ చదివింది. మరి కొన్నాళ్లలో దొరస్వామి రిటైర్ కాబోతున్నాడు. రిటైర్మెంట్ డబ్బులతో బిడ్డకు పెళ్లి చేయాలని భావించాడు.
ఈ క్రమంలో హరిత కోసం కుప్పంలో ఓ సంబంధం చూశాడు. అంతేకాక కుమార్తెకు కట్నంగా ఇవ్వడం కోసం 80 లక్షల విలువైన రూపాయల రెండంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి.. బిడ్డ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. మరి కొన్ని రోజుల్లో కుమార్తెకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయనుకున్న సమయంలో అనూహ్యంగా రెండు రోజుల క్రితం దొరస్వామి చనిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
దొరస్వామికి మద్యం సేవించే అలవాటు ఉంది. దానిలో భాగంగానే బుధవారం రాత్రి కూడా మద్యం తాగి నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. దాంతో చుట్టుపక్కల వారు దొరస్వామి మృతిపై మదనపల్లి పోలీసులకు సమాచారం అందింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు.
ఇక దొరస్వామి మృతి చెందిన సమయంలో ఇంట్లో ఆయన కుమార్తె హరిత మాత్రమే ఉంది. దాంతో పోలీసులు ఆమెను ప్రశ్నించారు. ముందు.. ఇంట్లోకి ఎవరో ప్రవేశించి.. తండ్రిని హత్య చేశారని చెప్పిన హరిత.. పోలీసులు గుచ్చి గుచ్చి అడగడంతో.. తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించింది. తన తండ్రి దొరస్వామి తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే ఈ పని చేశానని చెప్పుకొచ్చింది. కానీ పోలీసులు హరిత మాటలు నమ్మలేదు. దాంతో నిజం చెప్పమని బెదిరించడంతో అసలు విషయం వెల్లడించింది. తానే తండ్రిని హత్య చేశానని వెల్లడించింది.
మరి తన మీదనే ప్రాణాలు పెట్టుకున్న తండ్రిని ఎందుకు హత్య చేసింది అంటే.. విచ్చలవిడితనం. హరితకు ఇద్దరు ప్రియుళ్లు ఉన్నారు. వారిద్దరితో ఇంట్లోనే రొమాన్స్ చేస్తుంది హరిత. ఒకరోజు ఒక ప్రియుడు.. మరోరోజు ఇంకో బాయ్‌ఫ్రెండ్ హరిత ఇంటికి వస్తాడు. కొద్ది రోజుల్లోనే హరిత వ్యవహారం చుట్టుపక్కల వాళ్లకి తెలిసింది. దీని గురించి దొరస్వామికి చెప్పారు. కుమార్తె గురించి తెలుసుకున్న దొరస్వామి ఎంతో బాధపడ్డాడు. ఆమె జీవితం చేజారిపోకూడదని భావించి.. పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సంబంధాలు చూడటం ప్రారంభించాడు. కానీ హరిత మాత్రం తనకు పెళ్లి వద్దని చెప్పింది. ఈ విషయమై తండ్రి, కుమార్తెల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో ఆగ్రహించిన హరిత బాయ్‌ఫ్రెండ్స్ సాయంతో ఏకంగా తండ్రిని హత్య చేసింది.
తండ్రి హత్య కోసం హరిత పక్కాగా ప్లాన్ చేసిందిన. ఒక ప్రియుడికి రూ.10 లక్షల సుఫారీ ఇచ్చింది. ఆ తర్వాత హత్య జరిగింది. ఐతే.. దొరస్వామిని ఎవరు చంపారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే.. లవర్స్‌లో ఒకడు.. హత్య జరిగిన సమయంలో.. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్నాడు. మరొక బాయ్‌ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. హరిత మాత్రం.. చపాతీలు చేసే కర్రతో, ఇనుప రాడ్డుతో తానే తండ్రిని కొట్టి చంపానని పోలీసులకు చెప్పింది. కానీ హత్య జరిగిన తీరును బట్టీ.. ఆమె ఒక్కరే ఈ దారుణాన్ని చేసి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు కనీసం ఇద్దరు ముగ్గురు సహకరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు విషయం తెలుస్తుంది అన్నారు.