iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ లోనే హేమ! మరో కేసు నమోదు!

  • Published May 20, 2024 | 6:04 PM Updated Updated May 20, 2024 | 6:04 PM

Another Case Filed On Actress Hema- Rave Party: నటి హేమకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమె ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దానికి అదనంగా మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Another Case Filed On Actress Hema- Rave Party: నటి హేమకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమె ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దానికి అదనంగా మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

  • Published May 20, 2024 | 6:04 PMUpdated May 20, 2024 | 6:04 PM
బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ లోనే హేమ! మరో కేసు నమోదు!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవ్ పార్టీ కేసు కలవర పెడుతోంది. ఎందుకంటే బెంగళూరులో జరిగిన ఈ రేవ్ పార్టీలో దాదాపు 100 మందికి పైగా రాజకీయ- సినిమా ప్రముఖులు దొరికినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వారిలో నటి హేమ పేరును కూడా పోలీసులు ప్రకటించారు. అయితే తాను ఆ రేవ్ పార్టీలో లేనని.. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి నటి హేమ మీద మరో కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి చాలానే పేర్లు బయటకు వస్తాయంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీ అటు కర్ణాటక, ఇటు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ఒక బర్త్ డే పార్టీ ముసుగులో బెంగళూరులోని ఓ హోటల్ లో ఏకంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఆ రైడ్ లో ఆ హోటల్ లో నిజంగానే రేవ్ పార్టీ జరిగినట్లు నిర్ధారణ జరిగింది. అంతేకాకుండా పెద్దఎత్తున మద్యం, మాదకద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి దాదాపు 100 మంది వరకు హాజరైనట్లు పోలీసులు చెప్తున్నారు. వారిలో ఎక్కువ మంది రాజకీయ- సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు ఉన్నట్లు వెల్లడించారు. ఆ లిస్టులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ పేరు కూడా బయటకు వచ్చింది.

అయితే ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ నటి హేమ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత బెంగళూరు పోలీసులు హేమ ఫొటో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఉన్న డ్రెస్ లోనే పోలీసులు విడుదల చేసిన ఫొటోలో కూడా హేమ కనిపించింది. ఇప్పుడు ఆ వీడియో హేమకు లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టినట్లు అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో వల్ల ఆమెపై మరో కేసు నమోదు అయ్యింది. ఎందుకంటే ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉండి.. పోలీసులకు దొరికిపోయి.. పైగా తప్పుదోవ పట్టించేలా ఒక వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రేవ్ పార్టీ కేసు మాత్రమే కాకుండా.. హేమపై మరో కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది.

రేవ్ పార్టీకి సంబంధించి చాలామంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బెంగళూరు పోలీసులు అధికారికంగా విడుదల చేస్తే మరింత మంది వివరాలు తెలుస్తాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూసి.. కొందరు హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీకి వెళ్లాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే శ్రీకాంత్ అందరికీ వివరణ ఇచ్చాడు. తనకు అలాంటి పార్టీలకు వెళ్లే అలవాటు లేదని.. అసలు ఆ కల్చర్ గురించి కూడా తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా.. తనలా ఉన్నాడని తన పేరు పెట్టి రాయడం కరెక్ట్ కాదు అంటూ శ్రీకాంత్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom