iDreamPost
android-app
ios-app

HYDలో కిడ్నాప్‌ల కలకలం.. ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్

  • Published Sep 30, 2023 | 4:16 PM Updated Updated Sep 30, 2023 | 4:16 PM
  • Published Sep 30, 2023 | 4:16 PMUpdated Sep 30, 2023 | 4:16 PM
HYDలో కిడ్నాప్‌ల కలకలం.. ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్

హైదరాబాద్ నగరంలో వరుస కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఓ ఐదు సంవత్సరాల బాలుడు కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కాగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగరంలోని సీసీఫుటేజీల ఆదారంగా కిడ్నాపర్లను ట్రేస్ చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో బాలుడి ఆచూకీని కనుగొన్నారు. ఈ ఘటన మరువక ముందే మరో బాలుడు కిడ్నాప్ కు గురవ్వడంతో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా పాతబస్తీలో మరో 5ఏళ్ల వయసున్న బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. పట్టపగలే ఆగంతకులు బాలుడిని కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ లో కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. చిన్నపిల్లలే లక్ష్యంగా కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. కిడ్నాప్ లు పాల్పడుతున్నది నగరంలోని బెగ్గింగ్ మాఫియా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాతబస్తీ పరిధిలోని ఫలక్ నుమాలో ఐదేళ్ల బాలుడు అయాన్ కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు బాబు కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. వెంటనే బాలుడి తండ్రి ఫలక్ నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ ను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişkingroyalgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom