Dharani
ఆ మహిళ దురద్రుష్టం కొద్ది భర్త చనిపోయాడు. ముగ్గురు ఆడపిల్లల బాధ్యత ఆమె మీద ఉంది. బిడ్డల బాగోగులు చూసుకోవాల్సిన ఆ తల్లి తన స్వార్థం చూసుకోవడంతో.. నేడు ముగ్గురు ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. ఆ వివరాలు..
ఆ మహిళ దురద్రుష్టం కొద్ది భర్త చనిపోయాడు. ముగ్గురు ఆడపిల్లల బాధ్యత ఆమె మీద ఉంది. బిడ్డల బాగోగులు చూసుకోవాల్సిన ఆ తల్లి తన స్వార్థం చూసుకోవడంతో.. నేడు ముగ్గురు ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. ఆ వివరాలు..
Dharani
మన సమాజంలో ఉందరో ఒంటరి తల్లులను చూస్తూ ఉంటాము. భర్త నుంచి విడిపోవడమో లేక కట్టుకున్న వాడు కాలం చేయడం ఏదైతేనేమి.. ఒంటరిగా మిగిలిన మహిళలు.. బిడ్డలే లోకంగా బతుకుతుంటారు. తండ్రి లేకపోయినా.. తనకు చేతనైనంతలో బిడ్డలకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. తాము పస్తులుండి మరీ పిల్లల కడుపు నింపుతారు. బిడ్డల భవిష్యత్తు కోసం తమ సుఖం, సంతోషాన్ని వదులుకుని వారి కోసం కరిగిపోతారు. తండ్రి లేని బిడ్డలు.. ఏం తప్పు చేసినా.. తల్లినే అంటారనే ఉద్దేశంతో.. బిడ్డల పెంపకంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. తాను ఏ చిన్న తప్పు చేసినా పిల్లలు బలవుతారని భావించి.. జాగ్రత్తగా వారిని చూసుకుంటారు.
అయితే నేటి కాలంలో కొందరు తల్లులు మాత్రం.. కడుపున పుట్టిన బిడ్డల కన్నా తమ సుఖమే ముఖ్యం అనుకుంటున్నారు. ఫలితంగా వారు చేసిన తప్పులు బిడ్డల పాలిట శాపాలుగా మారుతున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తల్లి చేసిన తప్పు వల్ల ముగ్గురు ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. ఆ వివరాలు..
భర్త చనిపోయాడు.. ముగ్గురు ఆడపిల్లల బాధ్యత ఆమె మీద ఉంది. ఎంతో జాగ్రత్తగా పిల్లల సంరక్షణ చూసుకోవాల్సిన ఆ తల్లి శారీరక సుఖం కోసం తప్పటడుగు వేసింది. ఆమె చేసిన తప్పు వల్ల నేడు ఆ ముగ్గురు ఆడపిల్లలు తల్లీతండ్రి లేని అనాథలుగా మిగిలారు. వివాహాతేర సంబంధం మహిళ ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్, ఒంగోలులో చోటు చేసుకుంది. పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలిని గౌరిగా గుర్తించారు. ఇక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పదిహేనేళ్ల క్రితం నంధ్యాల జిల్లా గాజులపాలేనికి చెందిన కొండపల్లి గౌరి (32) కి అదే ప్రాంతానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివామం జరిగిది. వీరికి ముగ్గురు కుమార్తెలు. అయితే కొన్నాళ్ల క్రితం వెంకటరెడ్డి చనిపోయాడు. గౌరి బెల్దారి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో ఆమెకి నందిపల్లెకు చెందిన మహేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి కూడా వివాహమైంది. పిల్లలున్నారు. వీరిద్దరి పరిచయం కాస్త.. వివాహేతర బంధానికి దారి తీసింది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మహేష్.. గౌరి ఇంటికి వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటికి వివాదం సద్దుమణిగింది. మహేష్ ఇంటి బయట గడియపెట్టి వెళ్లాడు. శనివారం ఉదయం గౌరి ఇంట్లోనుంచి పాప ఏడుపు వినిపించగా స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూసేసరికి ఆమె చనిపోయి.. బెడ్ మీద పడి ఉంది. దాంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహేష్ గౌరిని హత్య చేసిన అనంతరం ఇంటికి తాళంవేసి వెళ్లిపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గౌరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న మహేష్ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లి చేసిన తప్పు వల్ల ముగ్గురు ఆడపిల్లలు అనాథలుగా మిగిలారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.