భార్యాభర్తల ప్రాణం తీసిన టమాట పంట! అసలేం జరిగిందంటే?

ఏపీకి చెందిన ఈ దంపతులకు గత మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కూతురు జన్మించింది. ఇక ఒకరి దగ్గర పని చేయడం ఎందుకని వీళ్లే వ్యవసాయం చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే పొలం చదును చేసి టమాట పంట నాటు వేశారు. పంట దిగుబడి వారి అనుకున్నదాని కంటే ఎక్కువే వచ్చింది. దీంతో ఈ దంపతులు మన పంట పండిందంటూ లోలోపల ఎంతో మురిసిపోయారు. కానీ, అదే పంట చివరికి ఈ దంపతుల ప్రాణాన్ని తీసుస్తుందని వాళ్లు ఊహించలేకపోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తుంది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం పట్టణ పరిధిలోని రొప్పం గ్రామానికి చెందిన మను (26), కంబదూరు మండలం పరిధిలోని పాలకుంట గ్రామానికి చెందిన పవిత్ర (22) గత మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు జన్మించింది. ఇక సంసారం ముందుకు నడవాలంటే పని చేయాలి కాబట్టి భర్త స్థానికంగా కూలీనాలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ వారి ఖర్చులకు ఆ డబ్బు అస్సలు సరిపోయేది కాదు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఓ ఐడియా తట్టింది. అదే వ్యవసాయం చేయడం.

అనుకున్నదే ఆలస్యం.. కొంత పొలం చదును చేసి టమాట పంట నాటు వేశారు. కొన్ని రోజులకు పంట కూడా బాగా వచ్చింది. ఇంతే కాదు.. పంట కాపు బాగానే కాసింది. మా పంట పండినట్టేనని ఈ భార్యాభర్తలు ఎంతో సంతోష పడ్డారు. పంటకోతకు రావడంతో మార్కెట్ కు తరలించారు. పంట దిగుబడి వారి అనుకున్నదాని కంటే ఎక్కువే వచ్చింది. కానీ, దారుణమైన విషయం ఏంటంటే? టమాటకు ధర లేకపోవడంతో వీళ్లు పూర్తిగా నష్టపోవడమే కాకుండా పెట్టిన ఖర్చులు కూడా తీరలేదు. ఇక చేసిన అప్పు ఎలా తీర్చాలనే మార్గం వీరికి కనిపించలేదు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఈ దంపతులు.. గురువారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని దంపతుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తుంది. టమాట పంటలో నష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకున్న ఈ దంపతుల నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments