iDreamPost
android-app
ios-app

కొడుకు ప్రాణం తీసిన తల్లిదండ్రుల వివాదం! అసలేం జరిగిందంటే?

  • Published Nov 06, 2023 | 3:21 PM Updated Updated Nov 06, 2023 | 3:21 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అనిల్. తల్లిదండ్రులతో పాటు ఉంటూ స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈ యువకుడు ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?

పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అనిల్. తల్లిదండ్రులతో పాటు ఉంటూ స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఈ యువకుడు ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?

  • Published Nov 06, 2023 | 3:21 PMUpdated Nov 06, 2023 | 3:21 PM
కొడుకు ప్రాణం తీసిన తల్లిదండ్రుల వివాదం! అసలేం జరిగిందంటే?

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇంట్లో తల్లిదండ్రుల వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘనటతో మృతుని కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంతకు ఆ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? తల్లిదండ్రులు దేనికి గొడవ పడ్డారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసలుడి గ్రామంలో కిష్టప్ప-లత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్ (21) అనే కుమారుడు ఉన్నాడు. ఈ యువకుడు చదువు మధ్యలో ఆపేసి స్థానికంగా ట్రాక్టర్ గా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంటి అవసరాల నిమిత్తం కిష్టప్ప గతంలో చాలా అప్పు చేశాడు. దీంతో వాళ్లు రోజూ అప్పు కట్టమని ఇంటికొచ్చి టార్చర్ చేసేవారు. వారి వేధింపులు భరించలేని కిష్టప్ప.. తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి అప్పులన్నీ తీర్చాలని అనుకున్నాడు. కానీ, దీనికి అతని భార్య లత దీనికి అంగీకరించలేదు. అయితే ఇదే విషయమై దంపతులు తరుచు గొడవ పడుతూ ఉండేవారు.

తల్లిదండ్రుల వివాదం చూసి అనిల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అనిల్ ఆదివారం సాయంత్రం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని అతని కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆ యువకుడు చనిపోయాడని నిర్ధారించారు. ఈ ఘటనతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom