iDreamPost
android-app
ios-app

వీడియో: వీడేం మనిషి రా బాబు! భార్యపై కోపంతో ఏం చేశాడో తెలుసా?

  • Published Aug 24, 2023 | 9:16 PM Updated Updated Aug 24, 2023 | 9:16 PM
  • Published Aug 24, 2023 | 9:16 PMUpdated Aug 24, 2023 | 9:16 PM
వీడియో: వీడేం మనిషి రా బాబు! భార్యపై కోపంతో ఏం చేశాడో తెలుసా?

సాధారణంగా భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. ఇంత దానికే కొందరు దంపతులు భార్యపై దాడికి దిగుతుంటారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆమెను హత్య చేయడమో చేస్తుంటారు. కానీ, తాజాగా ఓ భర్త భార్యపై కోపంతో ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు భార్యపై కోపంతో ఆ వ్యక్తి ఏం చేశాడు? అసలేం జరిగిందంటే?మీడియా కథనం ప్రకారం.. అమెరికా కాలిఫోర్నియాలోని ఆరేంజ్ కౌంటి ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీళ్లు గత కొంత కాలం నుంచి గొడవ పడుతున్నారు.

దీంతో ఈ భార్యాభర్తల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది వ్యవహారం. అప్పటి నుంచి భార్య భర్తను పూర్తిగా దూరం పెడుతూ వచ్చింది. ఇది ఆమె భర్తకు అస్సలు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి భార్యపై కోపంతో ఊగిపోయాడు. ఎలాగైనా తన కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ, ఇందులో భాగంగానే మనోడు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఏం చేశాడంటే? అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7:30 నిమిషాలకు ఆరేంజ్ కౌంటిలోని ఓ బార్ వద్ద కాల్పులకు తెగబబడ్డాడు. ఇతని కాల్పుల్లో నలుగురు మరణించినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ బార్ వద్దకు చేరుకుని ఆ నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ, అతడు పోలీసుల మీదకు కూడా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపగా నిందితుడు హతమయ్యాడు. కాగా, ఈ ప్రమాదంలో నిందితుడితో సహా ఐదుగురు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: కాలేజీకి వెళ్లొస్తానని చెప్పి.. అంతలోనే..!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet