iDreamPost
android-app
ios-app

కాలేజీకి వెళ్లొస్తానని చెప్పి.. అంతలోనే..!

కాలేజీకి వెళ్లొస్తానని చెప్పి.. అంతలోనే..!

ఈమె పేరు శివలింగు శ్రీజ. ఆమెకు గతంలో వివాహం జరిగింది. మాహాత్మా జ్యోతి బాపూలే గురుకుల కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఈ మహిళ చాలా కాలంగా ఇదే కాలేజీలో పని చేస్తున్నారు. ఇక శ్రీజ ఎప్పటిలాగే బుధవారం సైతం కాలేజీకి వెళ్లింది. విధులు ముగించుకుని తిరిగి ఇంటికెళ్లే క్రమంలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఈ మహిళ చివరికి ఇలా కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో శిలింగు వీరేన్-శ్రీజ (32) దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీజ సోఫినగర్ లో ఉన్న మాహాత్మా జ్యోతి బాపూలే గురుకుల కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నారు. అయితే ఈ మహిళ ఎప్పటి లాగే బుధవారం కూడా కాలేజీకి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఇక విధులు ముగించుకుని మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్లేందుకు భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరింది. ఈదుగాలంలోని సమీపంలోకి రాగానే వీరి వాహనాన్ని వెనకాల నుంచి బొలేరా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ, ఆమె భర్త బైక్ పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

ఇక తీవ్రంగా గాయపడిన ఈ మహిళతో పాటు ఆమె భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీజ చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఇక స్వల్ప గాయాలతో మృతురాల భర్త వీరేన్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, భార్య మరణవార్త తెలుసుకుని శోక సంద్రంలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఈమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే? శ్రీజ ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ కావడం విశేషం. ఇదే కాకుండా ఈమెకు 5 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. శ్రీజ మృతితో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: వీడియో: ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ ట్రాక్టర్, 9 మంది మృతి!

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş