iDreamPost
android-app
ios-app

ఆ చిన్న పొరపాటే ఈ దంపతులను ప్రాణాలతో లేకుండా చేసింది!

వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ, ఇటీవల వీరి చేసిన పొరపాటే వీరిని ప్రాణాలతో లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే?

వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కానీ, ఇటీవల వీరి చేసిన పొరపాటే వీరిని ప్రాణాలతో లేకుండా చేసింది. అసలేం జరిగిందంటే?

ఆ చిన్న పొరపాటే ఈ దంపతులను ప్రాణాలతో లేకుండా చేసింది!

వారిది నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటి బతుకుల్లో ఈ దంపతులు కాయా కష్టం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇకపోతే.. ఈ మహిళ భర్త గత కొన్నేళ్ల నుంచి మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో అతడు రోజూ మద్యం సేవించి భార్య, కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని తెలుస్తుంది. ఈ అలవాటును మార్చుకోవాలని అతని కుమారులు తండ్రికి అనేకసార్లు చెప్పి చూశారు. అయినా అతడు మాత్రం మద్యం తాగడం మాత్రం మానలేదు. ఇదిలా ఉంటే.. ఈ దంపతులు ఇటీవల ఓ రోజు రాత్రి గొడవ పడ్డారు. కట్ చేస్తే.. ఈ చిన్న పొరపాటే చివరికి ఈ దంపతులను ప్రాణాలతో లేకుండా చేసిందని కొందరు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంతకు ఆ పొరపాటు ఏంటి? ఈ భార్యాభర్తలు ఎలా చనిపోయారంటే?

పోలీసుల కథనం ప్రకారం.. అంబేద్కర్ కొనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలోని కట్వలాంబిక కాలనీలో పెదపూడి ఆదినారాయణ (42)-మంగాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాగరాజు, దుర్గప్రసాద్ అనే కుమారులు ఉన్నారు. అయితే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కావడంతో ఈ దంపతులు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లేవారు. అలా ఈ భార్యాభర్తలు సంసారాన్ని నెట్టుకొస్తూ ఉండేవారు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఆదినారాయణ మద్యానికి బానిసయ్యాడు. తరుచు సేవించి ఇంటికొచ్చేవాడు. ఇక ఎప్పటిలాగే ఆదివారం రాత్రి ఆది నారాయణ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. వస్తూ వస్తూనే రూ.2000 వేలు కావాలని భార్యను కోరాడు. దీనికి మంగాదేవి లేవని సమాధానమిచ్చింది.

దీంతో ఇదే విషయమై దంపతులు ఇద్దరు గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన ఆదినారాయణ.. ఇంట్లో ఉన్న పెట్రోల్ తన ఒంటిపై పోసుకున్నాడు. వెంటనే నిప్పు అంటించుకున్నాడు. పక్కనే ఉన్న కుమారులు, భార్య మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గంగాదేవి కూడా మంటలు అంటుకుని ఆమె సజీవదహనం అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వీరి మంటలు ఆర్పివేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఈ దంపతులు ప్రాణాలు కోల్పోగా.. వీరిద్దరి కుమారులు తీవ్రంగా గాయపడ్డార. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ రోజు ఆదినారాయణ అతిగా మద్యం సేవించడం, అదే క్షణికావేశంలో అతడు నిప్పు అంటించుకోవడం వంటివి ఈ ప్రమాదానికి దారి తీశాయని.., ఇక ఈ పొరపాట్లే చివరికి వీరిని ప్రాణాలతో లేకుండా చేశాయని గ్రామస్తులు చెబుతున్నారు.