Dharani
Dharani
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టైన కొన్ని రోజుల తర్వాత ఆయన కుమారుడు లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ఇదిలా ఉండగా.. ఇక తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో సీఐడీ లోకేష్‌ని ఏ 14గా చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో నారా లోకేష్ ఏపీ హైకోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ని మూసివేసింది. అంతేకాక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు లోకేష్‌కు.. 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హస్తినలో మకాం వేసిన లోకేష్ కోసం వెతుకులాట ప్రారంభించారు. లోకేష్ కోసం పలుచోట్ల సీఐడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే లోకేష్ కావాలనే తమ నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్లు సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు సీఐడీ అధికారులు. అయితే లోకేష్ మాత్రం వారికి చిక్కకుండా.. తప్పించుకుని.. కార్లు మారుస్తూ తిరుగుతున్నారని సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక స్కిల్ స్కాం కేసులో.. ఏపీ హైకోర్టులో లోకేష్‌కు ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు లోకేష్.. హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నారా లోకేష్‌ను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా.. అక్టోబర్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.