iDreamPost
android-app
ios-app

పాప మృతదేహం దొరకదని బాలుడి తండ్రి సవాల్ చేశాడు: ముచ్చుమర్రి బాలిక పేరెంట్స్

  • Published Jul 12, 2024 | 10:37 PMUpdated Jul 12, 2024 | 10:38 PM

Muchupalli Girl Case Update: ముచ్చుమర్రి బాలిక కేసు రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతుంది. సినిమాని తలపించే ట్విస్టులు నెలకొంటున్నాయి. ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా బాలిక మృతదేహం కనిపించలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి బాలుడి తండ్రి ఇంటికొచ్చి మరీ సవాలు చేసి వెళ్లాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. 

ఏపీలోని నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి మండలానికి చెందిన బాలిక కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొదట నదిలో పడేశామని చెప్పిన నిందిత బాలురు.. ఆ తర్వాత పూడ్చిపెట్టామని చెప్పారు. ఇలా ఊహించని మలుపు తిరుగుతున్న ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ముచ్చుమర్రి బాలిక కేసులో సినిమాని మించి ట్విస్టులు నెలకొంటున్నాయి. సినిమాల్లో ఎలా అయితే నేరం చేసిన పిల్లలను తల్లిదండ్రులు ఎలా అయితే వెనకేసుకొస్తారో అలా ఇక్కడ కూడా వెనకేసుకొస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందిత బాలుడి తండ్రి ఒకరు ఇంటికొచ్చి మరీ బాలిక మృతదేహం దొరకదని సవాల్ చేసి వెళ్లాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు.     

ఆదివారం నాడు అన్నం తిని 11 గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్లిందని.. ఆరోజు నుంచి కనబడలేదని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం మరుసటి రోజు పోలీసులు చెప్తేనే ఈ దారుణం గురించి తెలిసిందని అన్నారు. ముగ్గురు పిల్లలు అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు తెలిపారని అన్నారు. పిల్లల కుటుంబానికి, తమకు ఎలాంటి గొడవలు లేవని.. అయితే దీని వెనుక బాలురు తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని బాలిక తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల హస్తం లేకపోతే పిల్లలు అంత పకడ్బందీగా చేయలేరు కదా అని బాలిక తండ్రి అన్నారు. బాలుడి తండ్రి సవాలు చేశాడు.. నెల రోజుల్లోపు కాలువలో బాలిక మృతదేహం దొరికించుకోండి.. దొరకదు.. అని పందెం కాసాడని అన్నారు.

అమ్మాయిని కనిపెట్టండి చూద్దాం అని ఇంటికొచ్చి సవాల్ చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అతను ఎందుకు అలా అన్నాడో తమకు తెలియదని.. అసలు వాళ్లకి, మాకూ గొడవలు లేవని అన్నారు. తమ బిడ్డ మృతదేహం వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని.. త్వరగా వెతికిపెట్టమని కోరారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని.. కఠినంగా శిక్షించాలని.. తప్పు చేస్తే ఎవరైనా తప్పే అని.. చిన్న పిల్లల్ని అయినా.. పెద్ద వాళ్ళని అయినా ఒకేలా శిక్షించాలని కోరారు. తమ బిడ్డ ఎలా అయితే శిక్ష అనుభవించిందో.. ఆ నిందితులు కూడా అలాంటి శిక్ష అనుభవించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. మరి బాలుడు తండ్రి బాధిత తల్లిదండ్రుల ఇంటికెళ్లి మరీ అమ్మాయి మృతదేహం దొరకదని సవాలు చేశాడని చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి