Uppula Naresh
Uppula Naresh
ఈ మధ్యకాలంలో కొందరు దొంగలు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, రద్దీ ప్రదేశాలు ఇలా అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. చాలా చాకచక్యంగా దోపిడి చేస్తూ సైలెంట్ గా అక్కడి నుంచి చెక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాగే ఓ యువకుడు చాలా స్మార్ట్ గా, నీట్ గా దొంగతనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఓ రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ఓ ప్రయాణికుడు ఆదమరిచి నిద్రపోయాడు. ఇది గమనించిన ఓ యువకుడు అతని పక్కకు వెళ్లి పడుకున్నాడు. ఇక నిద్రపోతున్నట్టుగా నటిస్తూ పక్కనే ఉన్న ఆ యువకుడి ప్యాంట్ జేబులోని సెల్ ఫోన్ లో కొట్టేయాలని అనుకున్నాడు. ఇక ఎవరికీ అస్సలు అనుమానం రాకుండా నిద్రపోతున్న కటింగ్ ఇస్తూ సైలెంట్ గా అతని జేబులో ఉన్న ఆ సెల్ ఫోన్ కొట్టేశాడు. ఆ తర్వాత ఏం తెలియదన్నట్టుగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఇక ఆ యువకుడు నిద్రలో నుంచి లేచి చూసే సరికి అతని జేబులో సెల్ ఫోన్ మాయమైంది. అతనికి ఏం చేయాలో తెలియక వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఎట్టకేలకు ఆ దొంగని పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఆ యువకుడికి ఇచ్చారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ దొంగతనం ఇలా కూడా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
— Hardin (@hardintessa143) August 27, 2023
ఇది కూడా చదవండి: విషాదం: 50 వేల మంది ఉన్న స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి