iDreamPost
android-app
ios-app

నిద్రపోతున్న చిన్నారి నోట్లో పడ్డ బల్లి.. తర్వాత జరిగింది ఇదే!

నిద్రపోతున్న చిన్నారి నోట్లో పడ్డ బల్లి.. తర్వాత జరిగింది ఇదే!

అది జూలై 24న, ఉదయం 8 గంటలు. ఇదే సమయంలో ఓ మహిళ తన రెండున్నరేళ్ల బాలుడుని ఇంట్లో పడుకోబెట్టి ఇంట్లో పనులు చక్కబెట్టుకుటుంది. అయితే, వారి గదిలో ఉన్న ఓ బల్లి పై నుంచి జారిపడి ఉన్నట్టుండి ఆ రెండున్నేళ్ల బాలుడి నోట్లో పడింది. దీంతో ఆ బాలుడు ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. నిద్రలో అరిచి ఉంటుండాని ఆ తల్లి కాస్త ఆలస్యంగా వెళ్లి చూసే సరికి.. కుమారుడి నోట్లో బల్లి కనిపించింది. ఆ సీన్ చూసి ఆ మహిళ షాక్ గురైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్ గఢ్ కోర్బా జిల్లాలోని నాగిన్ భాంఠా ప్రాంతంలో రాజ్ కుమార్-సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు చిన్నారుల సంతానం. అయితే, వీరి చిన్న కుమారుడైన రెండున్నరేళ్ల జగదీష్ ను తల్లి ఈనెల 24న ఉదయం 8 గంటలకు పడుకోబెట్టింది. ఆ తర్వాత సంధ్య ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. ఇక కొద్దిసేపటి తర్వాత కుమారుడు అరిచిన శబ్దం రావడంతో తల్లి కాస్త ఆలస్యంగా కుమారుడి వద్దకు వెళ్లింది. ఇక వెంటనే అక్కడికి వెళ్లి చూడగా.. జగదీష్ నోట్లో బల్లి కనిపించింది.

ఆ సీన్ చూసి సంధ్య ఒక్కసారిగా షాక్ గురైంది. వెంటనే భార్యాభర్తలు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, బల్లి విషం కారణంగా జగదీష్ మరణించలేదని, నోట్లో శ్వాసకోస నాళానికి బల్లి అడ్డుపడడం ద్వారానే ఆ బాలుడితో పాటు బల్లి కూడా మరణించిందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: భర్త బిజినెస్ మ్యాన్, భార్య పొలిటిషియన్.. అంతా బాగానే ఉన్నా..!