iDreamPost
android-app
ios-app

భర్త బిజినెస్ మ్యాన్, భార్య పొలిటిషియన్.. అంతా బాగానే ఉన్నా..!

  • Published Jul 25, 2023 | 4:44 PM Updated Updated Jul 25, 2023 | 4:44 PM
  • Published Jul 25, 2023 | 4:44 PMUpdated Jul 25, 2023 | 4:44 PM
భర్త బిజినెస్ మ్యాన్, భార్య పొలిటిషియన్.. అంతా బాగానే ఉన్నా..!

పైన చూడటానికి అందంగా కనిపిస్తున్న ఈమె పేరు సుమన్ బెనివాల్, వయసు 32 ఏళ్లు. బాగానే చదువుకున్నారు. ఇక భర్త మాత్రం వ్యాపారంలో స్థిరపడి మంచి బిజినెస్ మ్యాన్ గా రాణిస్తుండగా.., భార్య రాజకీయ నాయకురాల్లో కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు మంలచి హోదాలో ఉండడంతో ఇద్దరికీ సమాజంలో మంచి పలుకుబడే ఉంది. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా సోయి లేకుండా అనుకోని దారుణానికి తెర లేపాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ జోధ్ పూర్ మాతా కథాన్ పరిధిలోని ఓ ప్రాంతంలో రమేష్ బెనివాల్ (35), సుమన్ బెనివాల్ (32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పిల్లలు పెరిగి పెద్దవారై స్కూల్ కు కూడా వెళ్తున్నారు. అయితే భర్త రమేష్ వ్యాపారంలో రాణిస్తుండగా, భార్య సుమన్ బినివాల్ మాత్రం ఓ రాజకీయ పార్టీలో కొనసాగుతూ మంచి లీడర్ ఎదుగుతున్నారు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే? గత శనివారం భర్త పని ముగించుకుని అర్థరాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. రమేష్ ఇంటికి రాగానే.. భోజనం పెట్టాలని భార్యను కోరాడు. దీనికి భార్య సమాధానిమిస్తూ.. నాకు కాస్త అలసటగా ఉందని, నువ్వు పెట్టుకోమంటూ తెలిపింది. ఇదే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త రమేష్ బెనివాల్.. ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్య సుమన్ బెనివాల్ ను అతి దారుణంగా హత్య చేశాడు. ఇదే విషయాన్ని భార్య కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడు రమేష్ బెనివాల్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

ఇది కూడా చదవండి: కూలిపోయిన వ్యాయామశాల పైకప్పు.. 11 మంది దుర్మరణం!

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş