iDreamPost
android-app
ios-app

దీప్తి మృతి కేసులో కీలక పరిణామం.. ఏం జరిగిదంటే?

దీప్తి మృతి కేసులో కీలక పరిణామం.. ఏం జరిగిదంటే?

జగిత్యాల జిల్లా కోరుట్లలో దీప్తి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. సోమవారం రాత్రి ఆమె చనిపోవడం, అదే రోజు ఆమె చెల్లెలు చందన కనిపించకుండా పోవడం, ఇంట్లో రూ.2 లక్షల నగదు, రూ.90 లక్షలు విలువ చేసే బంగారు నగలు మాయమైపోవడం అనేది పోలీసులకు సవాలుగా మారింది. ఇదే సమయంలో మరుసటి రోజు మృతురాలి చెల్లెలు చందన తన తమ్ముడైన సాయికి వాయిస్ మెసేజ్ పంపింది.

అందులో కీలకంగా ఏముందంటే.. “నేను, అక్క కలిసి మద్యం తాగింది నిజం. కానీ, నేను అక్కను చంపలేదు, నాకేం సంబంధం లేదు. నేను ఇంటి నుంచి బయటకు వచ్చాక ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదంటూ మృతురాలి చెల్లెలు చందన కన్నీళ్లు పెట్టుకుంది”. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆ యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఆమె మృతిపై అనేక అనుమానాలకు తావు ఇచ్చినట్లు అయింది.

ఈ క్రమంలోనే అదృశ్యం అయిన చందనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి ఆమె కోసం గాలిస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్న చందన ఆచూకి దొరకకపోవడం విశేషం. చందనకు, ఆమె ప్రియుడికి ఫోన్ గా ఇద్దరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇదే సమయంలో పోలీసులు తాజాగా చందనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ యువతి రాష్ట్రం దాటి పోయిందా? అసలు ఎక్కడుందనేది తెలుసుకోవడానికి పోలీసులు ఆపసోపాలు పడుతున్నారు. ఇక చందన దొరికితే కానీ అసలు నిజలు బయటపడే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు.