iDreamPost
android-app
ios-app

స్కూల్ వద్ద బాంబు పేల్చిన దుండగులు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!

  • Published Dec 05, 2023 | 5:11 PM Updated Updated Dec 05, 2023 | 5:11 PM

స్కూల్ వద్ద బాంబు పేల్చిన దుండగులు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

స్కూల్ వద్ద బాంబు పేల్చిన దుండగులు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

  • Published Dec 05, 2023 | 5:11 PMUpdated Dec 05, 2023 | 5:11 PM
స్కూల్ వద్ద బాంబు పేల్చిన దుండగులు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!

కొందరు దుండగులు తాజాగా ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా స్కూల్ వద్దే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) బాంబుని పేల్చారు. దీంతో అ స్కూల్ వద్ద ఉన్న నలుగురు చిన్నారులతో పాటు ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడున్న స్థానికులు అంతా ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఈ బాంబు పేలిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వాయివ్య పాకిస్థాన్ లోని పెషావర్ నగరంలో మంగళవారం స్కూల్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తితో పాటు నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందని అందరూ బయటకు వచ్చి చూసే సరికి భారీ పేలుడు జరిగింది. వెంటనే స్పందించిన కొందరు వ్యక్తులు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఎవరో గుర్తు తెలియని దుండగులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో బాంబు పేల్చారని గుర్తించారు.

అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి ఈ భారీ పేలుడు సంభవించడంతో అందరూ భయంతో వణికిపోయారు. కాగా, ఈ పేలుడు దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbet GirişHoliganbetjojobetgrandpashabetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcepbahis girişEscortes BelgiqueCasibomGrandpashabetgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomcasibom