Uppula Naresh
రాష్ట్ర ముఖ్యమంత్రిని వణికించిన 7 తరగతి పిల్లాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అవును, ఆ ముఖ్యమంత్రికి 7 తరగతి బుడ్డోడు చెమటలు పట్టించాడు. ఇంతకు స్టోరీ ఏంటంటే?
రాష్ట్ర ముఖ్యమంత్రిని వణికించిన 7 తరగతి పిల్లాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అవును, ఆ ముఖ్యమంత్రికి 7 తరగతి బుడ్డోడు చెమటలు పట్టించాడు. ఇంతకు స్టోరీ ఏంటంటే?
Uppula Naresh
ముఖ్యమంత్రిని వణికించిన 7వ తరగతి పిల్లాడు. అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా సీఎంకే చెమటలు పట్టించిన ఈ ఘటనతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడి అప్రమత్తమైంది. ఈ కాల్ రావడంతో మంత్రులు, అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకు 7వ తరగతి పిల్లాడు ఏం చేశాడు? ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని వణికించేంత పనేం చేశాడు? ఈ ఘటనలో అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఆర్టికల్ తప్పక చదవాల్సిందే.
అసలేం జరిగిందంటే?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సీఎంఓ ఆఫీసుతో పాటు పోలీస్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. అధికారులు సీఎం పినరయి విజయన్ కు వచ్చిన ఆ బెదిరింపు కాల్ ఎవరు చేశారు అనేది తెలుసుకునే పనిలో నిమిగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సీఎంకు ఎర్నాకులంకు చెందిన ఓ 7వ తరగతి పిల్లాడు కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకుని అందరూ షాక్ గురయ్యారు.
అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు సీఎం పినరయి విజయన్ కు ఫోన్ చేసి బెదిరించింది 7వ తరగతి పిల్లాడేనా? లేక దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 7వ తరగతి పిల్లాడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెమటలు పట్టించిన ఈ ఘటన గురించి ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా.. దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. చంపేస్తామంటూ సీఎంకు బెదిరింపు కాల్ చేసిన 7వ తరగతి పిల్లాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.