iDreamPost
android-app
ios-app

జొమాటోకు రూ.401 కోట్ల GST నోటీసులు..కంపెనీ ఏమందంటే?

Zomato Received Notice: జొమాటోకు గట్టి షాక్ తగిలింది. రూ.401 కోట్ల మేర జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది కేంద్రం. జీఎస్‌టీ డిమాండ్ నోటీసులపై జొమాటో కూడా సమాధానం ఇచ్చింది. ఇంతకి సంస్థ ఏం చెప్పిందంటే?

Zomato Received Notice: జొమాటోకు గట్టి షాక్ తగిలింది. రూ.401 కోట్ల మేర జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది కేంద్రం. జీఎస్‌టీ డిమాండ్ నోటీసులపై జొమాటో కూడా సమాధానం ఇచ్చింది. ఇంతకి సంస్థ ఏం చెప్పిందంటే?

జొమాటోకు రూ.401 కోట్ల GST నోటీసులు..కంపెనీ ఏమందంటే?

జొమాటో.. ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. కారణం.. ఫుడ్ డెలివరీ చేసే ప్రముఖ ఆన్ లైన్ సంస్థలో ఇది ఒకటి. చాలా మంది ఫుట్ ఆర్డర్ కోసం జొమాటోనే వినియోగిస్తున్నారు. ఇలానే ఈ సంస్థ కూడా దేశంలోనే అన్ని ప్రాంతాల్లో తన సేవలను విస్తరించింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా జొమాటోకు గట్టి షాక్ తగిలింది.  రూ.401 కోట్లు కట్టాలంటూ జీఎస్టీ నోటీసులు వచ్చాయి. కేవలం మాములు నోటీస్ కాకుండా డిమాండ్ నోటీసులను జారీ చేసింది. దీంతో కంపెనీ షేర్లు కూడా పడిపోతున్నాయి. మరి.. ఈ నోటీసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ప్రధానమైన వాటిల్లో జొమాటో ఒకటి. దీని ద్వారా నిత్యం ఎంతో మంది ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. తాజాగా ఈ సంస్థకు గట్టి షాక్ తగిలింది. తాజాగా డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ జొమాటోకు జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మొత్తం రూ.401 కోట్ల మేరక బకాయి పడినట్లు  ఆ నోటీసుల్లో పేర్కొంది. డెలివరీ చేయడం అనేది సేవ కాబట్టి 18 శాతం జీఎస్‌టీ కట్టాలని డీజీజీఐ స్పష్టం చేసింది. ఇక ఈ నోటీసుల నేపథ్యంలో జొమాటో షేర్లు పడిపోతున్నాయి.

నేడు ట్రేడింగ్ లో చూస్తే.. జొమాటో సంస్థ షేర్లు ఏకంగా 2.68 శాతం నష్టాల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం జొమాటో కంపెనీ షేరు రూ. 123.65 మార్క్ వద్ద కొనసాగుతోంది. జొమాట్ స్టార్టప్ కంపెనీ 2019, అక్టోబర్ 29 నుంచి 2022 మార్చి 31 మధ్య కాలానికి సంబంధించిన జీఎస్టీ బకాయిలు, వాటిపై ఉంటే జరిమానాలు, వడ్డీతో కలిసిపి మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు పేర్కొన్నారు. ట్యాక్స్ అధికారులు క్లెయిమ్ చేస్తున్న మొత్తం డెలివరీ ఛార్జీల రూపంలో వసూలు చేసినవే . ఇక ఈ నోటీసులపై జొమాటో సంస్థ స్పందించింది. తమవైపు నుంచి ఎలాంటి పన్ను బకాయిలు లేవని స్పష్టం చేసింది.

డెలివరీ భాగస్వాముల తరపున తాము డెలివరీ ఫీజులు వసూలు చేశామని పేర్కొన్నారు. అలానే నిబంధన ప్రకారమే..డెలివరీ భాగస్వాములే ఆ సేవలు అందించారని వివరించారు. ప్రస్తుతం కేవలం జీఎస్టీ  బకాయిల వివరణ మాత్రమే అడిగారని, ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జొమాటో సంస్థ వెల్లడించింది.  నోటిసులకు తమ వద్ద సరైన సమాధానం ఉందని, కాబట్టి సంస్థకు ఎలాంటి నష్టం ఉండబోదని పేర్కొంది. మరి.. జొమాటోకు అందిన నోటీసుల అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.