P Venkatesh
Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీ కోసం సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఐదేళ్లలో 11 లక్షలు పొందొచ్చు.
Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీ కోసం సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఐదేళ్లలో 11 లక్షలు పొందొచ్చు.
P Venkatesh
ఏ పని చేసినా కూడా లాభమే కోరుకుంటాం. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. అయితే పెట్టుబడులు ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వ రంగానికి చెందిన స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్స్స్ అందుకోవచ్చు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాల మాట అటుంచితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరి మీరు లక్షల్లో లాభాలనిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఐదేళ్లలో రూ. 11 లక్షలు పొందొచ్చు. నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
దేశ ప్రజల కోసం పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది. ఈ పథకాల్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేటు కూడా అధికంగా ఉంటుంది. పోస్టాఫీస్ పథకాల్లో అమలవుతున్న పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో ప్రతి నెల కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో 6.7 వడ్డీ అందిస్తోంది. ఈ పథకంలో ఐదు సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. మీరు పెట్టే పెట్టుబడిపైనే రాబడి ఆధారపడి ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్ పథకంలో రోజుకు 500 అంటే నెలకు రూ. 15000 ఇన్వెస్ట్ చేస్తే ఐదు సంవత్సరాల్లో రూ. 9 లక్షలు జమ అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు 6.7 ప్రకారం ఐదు సంవత్సరాలలో రూ. 1,70,492 వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం రూ. 10,70,492 చేతికి అందుతుంది. అంటే మీకు దాదాపుగా 11 లక్షలు వస్తాయి. మీకు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ కావాలనుకుంటే మరో ఐదేళ్ల పాటు ఇన్వెస్టు చేసుకోవచ్చు. అలా చేసినట్లైతే మీకు 25 లక్షలకు పైగానే వస్తాయి. ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు.