iDreamPost

Credit కార్డు నుంచి బ్యాంక్ ఖాతాకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా.. ఇలా చేసుకోండి

క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోయింది. స్టేటస్ తో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే మీ క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు ఎలా అంటే?

క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోయింది. స్టేటస్ తో సంబంధం లేకుండా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. అయితే మీ క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు ఎలా అంటే?

Credit కార్డు నుంచి బ్యాంక్ ఖాతాకి మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలా.. ఇలా చేసుకోండి

ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ కూడా క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. బ్యాంకులు కూడా తక్కువ శాలరీ ఉన్న వాళ్లకు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తున్నాయి. పలు రకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అంటగడుతున్నాయి బ్యాంకులు. అయితే క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం వల్ల అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీరుస్తాయి. అర్జెంటుగా డబ్బు అవసరం పడ్డప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుందామన్నా కుదరని పరిస్థితి. అప్పు కూడా అప్పటికప్పుడు లభించదు. ఇలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

క్రెడిట్ కార్డుల వాడకంతో లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. పద్దతి ప్రకారం వాడకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి అప్పుల్లో కూరుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అవసరాలకు వాడుకుని ఆ బిల్ ను టైమ్ ప్రకారం కట్టకపోతే ఛార్జీల మోత మోగిస్తాయి ఆయా బ్యాంకులు. అంతే కాదు సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో లోన్ తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. క్రెడిట్ కార్డును అన్నింటికి ఉపయోగించలేవు. అలాంటి సమయాల్లో క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ని అంగీకరించని చోట బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డులో ఉన్న నగదుని నెట్ బ్యాంకింగ్ ఫీచర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి పంపించుకోవచ్చు. అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్న నగదు మొత్తంపై క్రెడిట్ కార్డు కంపెనీలు 1 నుంచి 5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.

క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు ట్రాన్స్ ఫర్:

  • క్రెడిట్ కార్డు హోల్డర్లు మీ బ్యాంకుకి సంబంధించిన అఫిషియల్ వెబ్ సైట్‌లోకి లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోకి వెళ్లి లాగిన్ కావాలి.
  • క్రెడిట్ కార్డ్ విభాగానికి వెళ్లి. అక్కడ ‘ట్రాన్స్ ఫర్’ ఆప్షన్ ను ఎంచుకుని మీరు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
  • ఆపై సూచనలను అనుసరించి ట్రాన్సాక్షన్ ను పూర్తి చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి