iDreamPost
android-app
ios-app

అధిక రాబడినిచ్చే పోస్టాఫీస్ స్కీమ్.. నెలకు వెయ్యి పెట్టుబడితో.. చేతికి 5 లక్షలు

Public Provident Fund: మీరు మంచి రాబడినిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఆ పథకంలో నెలకు 1000 పెట్టుబడి పెడితే చాలు చేతికి 5 లక్షలు వస్తాయి.

Public Provident Fund: మీరు మంచి రాబడినిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే ఆ పథకంలో నెలకు 1000 పెట్టుబడి పెడితే చాలు చేతికి 5 లక్షలు వస్తాయి.

అధిక రాబడినిచ్చే పోస్టాఫీస్ స్కీమ్.. నెలకు వెయ్యి పెట్టుబడితో.. చేతికి 5 లక్షలు

ప్రస్తుత రోజుల్లో అంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. ఖర్చు చేసిన తర్వాత పొదుపు చేయడం కంటే పొదుపు చేసిన తర్వాతే ఖర్చు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మంచి పెట్టుబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. ప్రభుత్వానికి చెందిన పథకాల్లో పెట్టుబడి పెడితే గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు నిపుణులు. ఈ పథకంలో నెలకు వెయ్యి పెట్టుబడిపెడితే ఏకంగా రూ. 5 లక్షలు పొందొచ్చు.

పోస్టాఫీస్ అందించే అనేక పథకాల్లో పీపీఎఫ్ పథకం ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక లాభాలను అందుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు. పెట్టుబడిపై 7.1 శాతం వడ్డీని అందుకోవచ్చు. ఈ పథకంలో 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 5 సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోవొచ్చు. ఎవరైనా వ్యక్తి గానీ.. మైనర్ పేరిట గానీ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏటా కనీసం రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుతో పాటు, మీరు పోస్టాఫీసులో కూడా పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ పొందవచ్చు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీంలో రోజుకు రూ. 30 చొప్పున పెట్టుబడి పెడితే.. నెలకు రూ.1000 అవుతుంది. సంవత్సరానికి రూ.12000 జమ అవతుంది. మీరు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. అప్పుడు మీ పెట్టుబడి మొత్తం 2,40,000 అవతుంది. ప్రస్తుతమున్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ రూపంలో 2,92,663 వస్తుంది. అప్పుడు మీకు 20 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.రూ.5,32,663 అందుతాయి.  ప్రభుత్వానికి చెందిన స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది. మంచి రాబడిని పొందొచ్చు.