iDreamPost
android-app
ios-app

సిరులు కురిపించే ఎస్‌బీఐ స్కీమ్.. రోజుకు రూ.167 పొదుపుతో.. చేతికి రూ.8 లక్షలు!

SBI Recorring Deposit: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. లక్షల్లోలాభం అందుకోవచ్చు.

SBI Recorring Deposit: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. లక్షల్లోలాభం అందుకోవచ్చు.

సిరులు కురిపించే ఎస్‌బీఐ స్కీమ్.. రోజుకు రూ.167 పొదుపుతో.. చేతికి రూ.8 లక్షలు!

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు.. ప్రపంచం అంతా డబ్బుకు బానిస అయిపోయింది. నేటి రోజుల్లో డబ్బును బట్టే విలువ ఇస్తున్నారు. డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే వారిని వీడికి డబ్బు రోగం పట్టిందంటారు. కానీ, నిజానికి ఆ రోగం నయం కావడానికి ఆ డబ్బే అవసరం. డబ్బు ఉంటే ఆ ధైర్యమే వేరు.. ఆ రాజసమే వేరు. సరిపడా డబ్బు చేతిలో ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అందుకే డబ్బు సంపాదనకై అంతా పరిగెడుతున్నారు. మనీ సంపాదించేందుకు అందుబాటులో ఉన్న మార్గాల కోసం సెర్చ్ చేస్తున్నారు. మరికొంత మంది వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించాలని చూస్తున్నారు. మరి మీరు కూడా మంచి లాభాలను అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన స్కీమ్ ను అందిస్తున్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో రోజుకు రూ. 167 ఇన్వెస్ట్ చేస్తే చాలు మెచ్యూరిటీ సమయానికి ఏకంగా రూ. 8 లక్షలు అందుకోవచ్చు.

ఎస్బీఐ తమ ఖాతాదారుల కోసం అదిరిపోయే స్కీమ్ లను తీసుకొచ్చి అమలు చేస్తున్నది. తక్కువ మొత్తంలో నెల నెలా పొదుపు చేసే వారికి బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే అదిరిపోయే బెనిఫిట్స్ అందుకోవచ్చు. ఆర్డీ స్కీమ్ మీకు సిరులు కురిపిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. మంచి ఆధాయం కోరుకునే వారికి ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ ఆర్డీ స్కీమ్ లో ఎస్‌బీఐ తమ కస్టమర్లకు గరిష్ఠంగా 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ టెన్యూర్‌ గల బ్యాంక్ డిపాజిట్లు ఉంటే సీనియర్ సిటిజన్లకు గరిష్ఠ వడ్డీ రేట్లు కల్పిస్తోంది.

10 సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. అయితే ఇదీ 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. వారి పేరుపై రోజుకు రూ. 167 చొప్పున నెలకు రూ.5 వేలు జమ చేసుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ ముగిసిన తర్వాత చేతికి దాదాపు రూ. 8 లక్షల వరకు అందుకోవచ్చు. ప్రతి నెల రూ. 5 వేలు కడితే పదేళ్లలో మీ పెట్టుబడి మొత్తం రూ. 6,00,000 అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీరేటు ప్రకారం మీ పెట్టుబడిపై రూ. 2,92,880 ఆదాయం సమకూరుతుంది. 10సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు జమ చేసిన సొమ్ము, దానిపై వచ్చే వడ్డీ ఆదాయం కలుపుకుని మొత్తం మీ చేతికి రూ. 8,92,880 అందుతుంది. మీరు పెట్టే పెట్టుబడిపై రాబడి ఆధారపడి ఉంటుంది.