iDreamPost
android-app
ios-app

స్కీమ్ అంటే ఇది కదా.. రోజుకు రూ. 70 పొదుపుతో చేతికి 6 లక్షలు పొందే ఛాన్స్

Public Provident Fund Scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ లో రోజుకు 70 పొదుపుతో 6 లక్షలు చేతికి అందుకోవచ్చు.

Public Provident Fund Scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ లో రోజుకు 70 పొదుపుతో 6 లక్షలు చేతికి అందుకోవచ్చు.

స్కీమ్ అంటే ఇది కదా.. రోజుకు రూ. 70 పొదుపుతో చేతికి 6 లక్షలు పొందే ఛాన్స్

బ్రతుకు బండిని నడిపేది డబ్బు. మనిషికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది డబ్బు . సంతోషాన్ని ఇస్తుంది. గౌరవమర్యాదలను తెచ్చిపెడుతుంది. డబ్బును ఈరోజు మీరు పొదుపు చేస్తే రేపు అది మిమ్మల్ని కాపాడుతుంది. మీపై ఆధారపడ్డ వాళ్లను కూడా రక్షిస్తుంది. అందుకే సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. నేటి రోజుల్లో చాలా మంది పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకుని ఏదో ఒక రూపంలో పొదుపు చేస్తున్నారు. భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు ఆలోచిస్తున్నారు. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. ఆపదలు ఎప్పుడు ఎలా సంభవిస్తాయో చెప్పలేము. అటువంటి సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అదే మీరు ముందుగానే పొదుపు చేశారంటే ఆ సొమ్ము ఆపద సమయంలో ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా భవిష్యత్తుకోసం కొంత డబ్బును దాచుకోవాలనుకుంటున్నారా? సురక్షితమైన రాబడిని అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే ప్రభుత్వరంగానికి చెందిన అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం. బ్యాంక్, పోస్టాఫీసులో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్‌లో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభం అందుకోవచ్చు. ఈ స్కీమ్ లో రోజుకు రూ. 70 పొదుపు చేస్తే మెచ్యూరిటీ నాటికి మీరు రూ 6 లక్షలు పొందుతారు. పీపీఎఫ్ స్కీమ్ లో మీరు పెట్టే పెట్టుబడిని బట్టి రాబడి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.

ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంది. లేదంటే స్థిరంగా కూడా ఉంటుంది. పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంవత్సరానికి కనీసం రూ. 500 అయినా పెట్టుబడి పెడితే స్కీమ్ అకౌంట్ కొనసాగుతుంది. ఈ పథకం మెచ్యూరిటీ 15 ఏళ్లు. అలాగే ఈ పథకంపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పథకంలో మీరు ప్రతిరోజూ రూ.70 పెట్టుబడి పెట్టాలి. అంటే ప్రతి నెలా రూ.2100 ఇన్వెస్ట్‌ చేస్తారు. దీని ప్రకారం, ప్రతి సంవత్సరం రూ.25,200 పీపీఎఫ్‌ అకౌంట్లో డిపాజిట్‌ చేస్తారు. ఇలా 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి 3లక్షల78 వేలు అవుతుంది.

ప్రస్తుతం పీపీఎఫ్‌ సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది. మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీ రూపంలో 3లక్షల 5 వేల 459 వస్తుంది. ఈ విధంగా 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి మొత్తం 6 లక్షల 83 వేల 459 చేతికి అందుతుంది. అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, మీ అవసరాన్ని బట్టి పీపీఎఫ్‌ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ సబ్‌స్క్రైబర్స్, అకౌంట్‌ ఓపెన్‌ చేసిన 7వ సంవత్సరం తర్వాత పార్షియల్ అమౌంట్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు. అవసరమైన సమయాల్లో, 3 సంవత్సరాల పెట్టుబడిని పూర్తి చేసిన తర్వాత బ్యాలెన్స్‌పై లోన్‌ పొందవచ్చు.a