P Venkatesh
Post office time deposit scheme: మీరు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను అందుకోవాలనుకుంటే అదిరిపోయే పోస్టాఫీస్ స్కీం అందుబాటులో ఉంది. నెలకు ఇంత కడితే రూ. 7 లక్షలు అందుకోవచ్చు.
Post office time deposit scheme: మీరు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను అందుకోవాలనుకుంటే అదిరిపోయే పోస్టాఫీస్ స్కీం అందుబాటులో ఉంది. నెలకు ఇంత కడితే రూ. 7 లక్షలు అందుకోవచ్చు.
P Venkatesh
ఎవరైనా కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఇచ్చే మార్గాలను వెతుకుతుంటారు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ. పెట్టుబడి ఎప్పుడు కూడా సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వం అందించే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే భద్రతా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో నెలకు ఇంత కడితే 7 లక్షలు అందుకోవచ్చు.
దేశ ప్రజల కోసం అదిరిపోయే స్కీమ్స్ ను అమలు చేస్తున్నది పోస్టాఫీస్. మహిళలు, వృద్ధులు, చిన్నారుల కోసం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తున్నది. కాగా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వడ్డీ రూపంలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి. మరి ఈ పథకంలో 7 లక్షలు పొందాలంటే ఎంత కట్టాలంటే?
ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 7.0. శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2,24,974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని రూ. 7,24,149 పొందొచ్చు. ఈ మొత్తాన్ని తీయకుండా మరో ఐదేళ్లు పొడిగించుకున్నట్లైతే పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీతో కలిపి 10 లక్షల వరకు అందుకోవచ్చు.