iDreamPost
android-app
ios-app

LIC నుంచి మతిపోయే స్కీమ్.. రోజుకు రూ. 45 పెట్టుబడితో చేతికి 25 లక్షలు

LIC Jeevan Anand policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?అయితే ఎల్ఐసీలో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. రూ. 45 పొదుపుతో మెచ్యూరిటీ నాటికి 25 లక్షలు అందుకోవచ్చు.

LIC Jeevan Anand policy: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?అయితే ఎల్ఐసీలో బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. రూ. 45 పొదుపుతో మెచ్యూరిటీ నాటికి 25 లక్షలు అందుకోవచ్చు.

LIC నుంచి మతిపోయే స్కీమ్.. రోజుకు రూ. 45 పెట్టుబడితో చేతికి 25 లక్షలు

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటుంటారు. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తే అది కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే ముందుగానే మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఆపద సమయంలో మీరు పొదుపు చేసుకున్న సొమ్ము సాయపడుతుంది. ఆప్పుల ఊబిలోంచి బయటపడేస్తుంది. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడి పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. పోస్టాఫీస్ లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ కు ఆదరణ ఎక్కువ. చిన్న మొత్తంలో పొదుపు చేసి మంచి లాభాలను పొందే వీలుంటుంది.

దీంతో పాటు జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కూడా దేశ ప్రజలకు అద్భుతమైన స్కీమ్స్ ను అందుబాటులో ఉంచుతుంది. ఎప్పటికప్పుడు నూతన పాలసీలను ప్రవేశపెడుతుంది ఎల్ఐసీ. పాలసీదారులకు రకరకాల ప్రయోజనాలను అందిస్తున్నది. మరి మీరు కూడా ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ నుంచి మతిపోయే పాలసీ అందుబాటులో ఉంది. అదే ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో రోజుకు రూ. 45 పెట్టుబడితో 35 ఏళ్ల వ్యవధిలో రూ. 25 లక్షలు పొందొచ్చంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలు అందుకోవచ్చు. టర్మ్ పాలసీ బోనస్, డెత్ ప్రయోజనాలను మాత్రమే కాకుండా అదనపు రక్షణ కోసం యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ రైడర్ వంటి అదనపు బెనిఫిట్స్‌ను అందిస్తుంది.

ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత కూడా బీమా రక్షణ అమల్లో ఉంటుంది. ఈ పాలసీ.. అనువైన ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచింది. రెండు సంవత్సరాల తర్వాత పాలసీ సరెండర్‌ను అనుమతిస్తుంది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ. 45 అంటే నెలకు రూ. 1358 డిపాజిట్ చేయడం ద్వారా 35 ఏళ్లలో రూ. 25 లక్షల వరకు జమ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పాలసీ హోల్డర్ ప్రమాదం కారణంగా చనిపోతే.. పాలసీ అడిషనల్ కవరేజీ మొత్తాన్ని రూ. 5 లక్షలు ఇస్తుంది. ఇంకా పాలసీదారు శాశ్వత వైకల్యం బారిన పడితే.. బీమా మొత్తం వాయిదాల రూపంలో చెల్లిస్తారు. ఈ పాలసీలో రెండు బోనస్‌లు ఉన్నాయి. 35 ఏళ్లలో రూ. 5 లక్షల 70 వేల 500 డిపాజిట్ మొత్తం పొందొచ్చు.

మెచ్యూరిటీ తర్వాత.. పాలసీ హోల్డర్ డిపాజిట్ చేసిన మొత్తంపై అదనంగా రూ. 8 లక్షల 60 వేల రివిజనరీ బోనస్, రూ. 11 లక్షల 50 వేల ఫైనల్ బోనస్‌ వస్తుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే బోనస్ కలుపుకుని మొత్తంగా మీకు 25 లక్షలు వస్తాయి. ఈ బోనస్ పొందాలంటే పాలసీ కనీసం 15 సంవత్సరాలు చెల్లించాలి. పాలసీ హోల్డర్ మరణిస్తే.. నామినీ డెత్ బెనిఫిట్స్‌లో 125 శాతం వరకు అందుకునే వీలుంటుంది. ఈ పాలసీలో చేరేందుకు అర్హత వయసు కనీసం 18 సంవత్సరాలు. గరిష్ట ప్రవేశ వయస్సు 50 ఏళ్లు. ప్రాథమిక హామీ మొత్తం రూ. లక్ష. పాలసీ తీసుకున్న మూడేళ్లకు లోన్ సదుపాయం కూడా పొందొచ్చు.