iDreamPost
android-app
ios-app

కోటీశ్వరులను చేసే బెస్ట్ స్కీం.. నెలకు ఎంత కట్టాలంటే?

EPFO: మీరు పెట్టుబడి పెట్టేందుకు మంచి పథకం కోసం ఎదురుచూస్తున్నారా? కోటీశ్వరులను చేసే బెస్ట్ ప్రభుత్వ పథకం అందుబాటులో ఉంది. అందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభం పొందొచ్చు.

EPFO: మీరు పెట్టుబడి పెట్టేందుకు మంచి పథకం కోసం ఎదురుచూస్తున్నారా? కోటీశ్వరులను చేసే బెస్ట్ ప్రభుత్వ పథకం అందుబాటులో ఉంది. అందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభం పొందొచ్చు.

కోటీశ్వరులను చేసే బెస్ట్ స్కీం.. నెలకు ఎంత కట్టాలంటే?

డబ్బు చేతిలో ఉంటే ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి సంపాదించిన ప్రతి రూపాయి ఇంపార్టెంట్. వృథా ఖర్చులు కాకుండా అసవరానికి మాత్రమే ఖర్చు పెడుతూ పొదుపు చేస్తే భవిష్యత్ బెటర్ గా ఉంటుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు పొదుపు చేసిన సొమ్ము యూజ్ అవుతుంది. పొదుపు చేసిన సొమ్మును మంచి ఇన్వెస్ట్ మెంట్ గా మారిస్తే మీరు కోటీశ్వరులు కావొచ్చు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. ఆ స్కీం ఏంటంటే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు అయిపోవచ్చు. నెలకు ఎంత కట్టాలో ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.

ఉద్యోగుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పొదుపు పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే రిటైర్మెంట్ సమయంలో భారీ లాభం పొందొచ్చు. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈపీఎఫ్ ఉపయోగపడుతుంది. ఉద్యోగులకు ఆయా సంస్థలు ఈపీఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంటాయి. దీన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహిస్తూ ఉంటుంది. ఈపీఎఫ్‌వోలో వార్షిక వడ్డీరేటు 8.25 శాతంగా అమలవుతున్నది. ప్రభుత్వ పథకం కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు.

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ పథకంలో నెలకు రూ.6,400 చొప్పున 35 ఏళ్లపాటు కడితే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.1.52 కోట్లు అందుకోవచ్చు. అలాగే రూ.10,600 చెల్లిస్తే రూ.2.51 కోట్లు పొందవచ్చు. అయితే రూ.12,500 చొప్పున 37 సంవత్సరాలు చెల్లిస్తే రిటైర్మెంట్‌ వయసులో రూ.3.5 కోట్లు వస్తాయి. నెలనెలా ఉద్యోగులు కొంత మొత్తాలను చెల్లిస్తే.. పదవీ విరమణ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో లభిస్తుంది. సాధారణంగా 58 ఏండ్లు దాటితేగానీ లబ్ధిదారునికి ఈపీఎఫ్‌వో పెన్షన్‌ రాదు. ముందస్తు పెన్షన్‌ కావాలంటే కనీసం 50 సంవత్సరాలు దాటాలి.