P Venkatesh
Janaushadhi: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్నిచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం అందుబాటులో ఉంది. 5 వేల పెట్టుబడితో నెలకు 50 వేలు పొందొచ్చు.
Janaushadhi: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్నిచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం అందుబాటులో ఉంది. 5 వేల పెట్టుబడితో నెలకు 50 వేలు పొందొచ్చు.
P Venkatesh
యువతలో ఉద్యోగాల కంటే వ్యాపారం చేయాలనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగమైతే నెల నెలా శాలరీ వస్తుంది. వ్యాపారం రిస్క్ తో కూడుకున్నది. అయినప్పటికీ బిజినెస్ కే ప్రియారిటీ ఇస్తున్నారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. కొందరు పౌల్ట్రీ, డెయిరీ, ఫర్టీలైజర్ షాప్స్ ఇలా ఏదో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. మరి మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం అందించే సూపర్ స్కీం అందుబాటులో ఉంది. ఈ స్కీంలో 5 వేల పెట్టుబడితో నెలకు 50 వేల ఆదాయం అందుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నది. ఆర్థిక భరోసా కల్పించేందుకు అవసరమైన పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ క్రమంలో మీరు తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన వ్యాపారాన్ని చేయాలనుకుంటే ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రం బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు అవసరమైన మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఈ జన ఔషధి కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని యువత ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. మరి ఈ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటే ఏ అర్హతులు ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించాలనుకునే వారు డి. ఫార్మా లేదా బి. ఫార్మా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి 5 వేలు చెల్లించాలి. ప్రధాన మంత్రి జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, ప్రభుత్వం ప్రోత్సాహక రూపంలో ఆర్థికసాయం అందజేస్తుంది. ఫర్నీచర్ కొనుగోలుకు రూ. 1.5 లక్షల వరకు సాయం అందిస్తున్నది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ తదితరాల కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. 5 లక్షల వరకు లేదా గరిష్టంగా రూ. 15,000 వరకు నెలవారీ మందుల కొనుగోలుపై 15 శాతం ప్రోత్సాహకం అందిస్తుంది. జనౌషధి కేంద్రంలో మందుల విక్రయంపై మీకు 20 శాతం కమీషన్ లభిస్తుంది. అన్నీ కలుపుకుని మీకు నెలకు రూ. 50 వేల ఆదాయ సమకూరుతుంది. ప్రధాన మంత్రి జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించాలనుకునే వారు అధికారిక వెబ్ సైట్ janaushadhi.gov.in ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.