iDreamPost
android-app
ios-app

లాభాలనిచ్చే ఎస్‌బీఐ ‘అమృత్ కలశ్’ స్కీమ్.. రూ.5 లక్షలు జమ చేస్తే చేతికి ఎంతొస్తుందంటే?

  • Published Sep 22, 2024 | 12:37 PM Updated Updated Sep 22, 2024 | 12:37 PM

SBI Amrit Kalash: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ 'అమృత్ కలశ్' స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆదాయం అందుకోవచ్చు. ఈ పథకం త్వరలోనే ముగియనున్నది.

SBI Amrit Kalash: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్‌బీఐ 'అమృత్ కలశ్' స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆదాయం అందుకోవచ్చు. ఈ పథకం త్వరలోనే ముగియనున్నది.

లాభాలనిచ్చే ఎస్‌బీఐ ‘అమృత్ కలశ్’ స్కీమ్.. రూ.5 లక్షలు జమ చేస్తే చేతికి ఎంతొస్తుందంటే?

ఈ లోకంలో మనీకి ఉన్న విలువ మనిషికి లేదు. అందుకే ధనం విలువ తెలుసుకో అని చెబుతుంటారు. డబ్బును ఈ రోజు నువ్వు పొదుపు చేస్తే రేపటినాడు అది నిన్ను కాపాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది ఖర్చులను తగ్గించుకుని పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము వృథాగా ఖర్చుపెట్టుకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలను అందుకోవచ్చు. పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ పొందాలంటే మాత్రం ప్రభుత్వ ప్రభుత్వ పథకాలే బెస్ట్ అని చెప్పొచ్చు. మరి మీరు కూడా పొదుపు చేయాలనుకుంటున్నారా?అయితే ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే స్కీమ్ ను అందిస్తున్నది. అదే అమృత్ కలశ్ పథకం. ఇందులో సేవింగ్ చేస్తే అధిక వడ్డీతో మంచి లాభాన్ని అందుకోవచ్చు.

ఎస్బీఐ తన కస్టమర్ల కోసం సూపర్ స్కీమ్ లను తీసుకొస్తున్నది. ఆ పథకాలకు అధిక వడ్డీని అందిస్తూ భారీ ప్రయోజనాలను చేకూరుస్తున్నది. ఫిక్స్ డ్ డిపాజిట్స్ చేసే వారి కోసం ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కు కస్టమర్ల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ 400 రోజులు మాత్రమే. అయితే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 30, 2024 వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉండనున్నది. పెట్టుబడిపై అధిక వడ్డీ కావాలనుకునే వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అమృత్ కలశ్ ఎఫ్‌డీ పథకంలో సాధారణ పౌరులకు 7.1 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.6 శాతం మేర వడ్డీ అందిస్తోంది. మరి ఈ పథకంలో రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లైతే చేతికి ఎంతొస్తుందో ఇప్పుడు చూద్దాం.

అమృత్ కలశ్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఒక కస్టమర్ (60 ఏళ్ల వయసు లోపు) రూ.5 లక్షలు జమ చేసినట్లయితే దానికి 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీ డిపాజిట్ పై వడ్డీ రూ. 38,850 వరకు లభిస్తుంది. మొత్తంగా చేతికి రూ. 5,38,850 లభిస్తాయి. అదే ఒక సీనియర్ సిటిజన్ (60 ఏళ్ల వయసు దాటిన వారు) రూ.5 లక్షలు జమ చేసినట్లయితే 7.6 శాతం వడ్డీ వర్తిస్తుంది. మెచ్యూరిటీ అనంతరం వడ్డీ రూ. 41,600 వరకు వస్తుంది. అంటే మొత్తంగా చేతికి రూ. 5,41,600 వరకు అందుతుంది. ఇతర పథకాల్లో కంటే ఈ స్కీమ్ లో వడ్డీ రేటు అధికంగా ఉండడంతో తక్కువ కాలంలోనే మంచి వడ్డీ ఆదాయం పొందొచ్చు. సురక్షితమైన రాబడిని అందుకోవచ్చు.