ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. ఏకంగా ఏడాదికి 50 వేల పెన్షన్!

మీరు మీ పెట్టుబడిపై మంచి రాబడిని కోరకుంటున్నారా? భవిష్యత్తులో ప్రతి నెల ఆదాయం రావాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.

మీరు మీ పెట్టుబడిపై మంచి రాబడిని కోరకుంటున్నారా? భవిష్యత్తులో ప్రతి నెల ఆదాయం రావాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.

నేటి రోజుల్లో డబ్బు సంపాదనపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు. డబ్బు సంపాదనకు గల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం మంచి రాబడిని అందించే పథకాల కోసం ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థికంగా ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా నెలా నెలా కొంత ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటి వారికోసం అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో లైఫ్ ఇన్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అందించే సరళ్ పెన్షన్ స్కీమ్‌ బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతీ నెల పెన్షన్ పొందొచ్చు.

ఎల్ఐసీ అందించే సరళ్ పెన్షన్ స్కీమ్‌ లో ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు. ఇందులో చేరితే 40 ఏళ్ల నుంచే పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. సరళ్ పెన్షన్ యెజనలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినీకి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం చెల్లిస్తారు. ఈ పాలసీని రెండు రకాలుగా ఎంచుకోవచ్చు. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్.. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది.

పాలసీదారుడి మరణానంతరం పెట్టుబడి సొమ్మును భార్యకు లేదా నామినీకి అందిస్తారు. రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్.. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ రావడంతో పాటు అతని మరణానంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ మొదలవుతుంది. వీరి మరణానంతరం నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు. సరళ్ పెన్షన్ యెజనలో రూ. 10 లక్షల సింగిల్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పెన్షన్ అందుకుంటారు.

Show comments