P Venkatesh
పెళ్లైన వారికి గుడ్ న్యూస్. కేంద్రం అందించే ఆ పథకంలో మీ భార్యపేరు మీద ఖాతా తెరిచి పెట్టుబడిపెడితే నెలకు దాదాపు 45 వేలు పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?
పెళ్లైన వారికి గుడ్ న్యూస్. కేంద్రం అందించే ఆ పథకంలో మీ భార్యపేరు మీద ఖాతా తెరిచి పెట్టుబడిపెడితే నెలకు దాదాపు 45 వేలు పొందొచ్చు. ఇంతకీ ఆ పథకం ఏంటంటే?
P Venkatesh
నేటి రోజుల్లో ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉన్నది. ప్రపంచమంతా డబ్బు వెనకాలే పరుగెడుతున్నది. ప్రతి ఒక్కరు ఆదాయమార్గాల కోసం వెతుకుతున్నారు. డబ్బు సంపాదిస్తే భవిష్యత్తులో వచ్చే ఆర్థిక కష్టాలను ఈజీగా ఎదుర్కోవచ్చు. ఎంత సంపాదించిన అందులో కొంత పొదుపు చేయకపోతే మాత్రం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా కేంద్ర ప్రభుత్వం మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే లాభాలను అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీం పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో మీ భార్యపై అకౌంట్ తెరిచి పొదుపు చేస్తే ప్రతి నెల ఆదాయం పొందొచ్చు. ఏకంగా 45 వేల వరకు పొందే ఛాన్స్ ఉంది.
బ్రతుకు బండిని నడిపించేది డబ్బే. కుటుంబం ఏ చీకూచింత లేకుండా జీవించాలంటే అవసరానికి సరిపడ డబ్బు ఉండాల్సిందే. అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలో నెల నెల శాలరీ వస్తుంది. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. కానీ పదవీ విరమణ చేసిన తర్వాత ఆదాయం ఉండదు. పెన్షన్ పై ఆధారపడాల్సి వస్తుంది. లేదా ఇతరులపై ఆధారపడాలి. మరి మీ వైఫ్ కు భవిష్యత్తులో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తకూడదు అంటే నేషనల్ పెన్షన్ స్కీంలో మీ భార్యపేరు మీద ఖాతా తెరిచి పొదుపు చేస్తే చాలు 60 ఏళ్ల తర్వాత నెలనెల ఆదాయం లభిస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఏ లోటు ఉండదు. రెగ్యూలర్ గా ఆదాయం అందుకోవచ్చు. వృద్ధాప్య దశలో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకూడదంటే ఇప్పటి నుంచే పొదుపు చేస్తే మేలు.
నేషనల్ పెన్షన్ స్కీంలో 18 నుంచి 70 ఏళ్లలోపు వయసు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. నెల వారీగా లేదా వార్షికంగా పొదుపు చేసే సౌకర్యం ఉంది. ఎన్పీఎస్ ఖాతా 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో మీ భార్య పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి నెలకు రూ. 5000 పెట్టుబడి పెడితే రూ. 1.14 కోట్ల ఫండ్ లభిస్తుంది. ఉదాహరణకు మీ భార్య వయస్సు 30 ఏళ్లు అనుకుంటే.. ఆమె ఎన్‌పీఎస్ ఖాతాలో నెలకు రూ. 5000 పెట్టుబడి పెడుతున్నారని అనుకుందాం. పెట్టుబడికి 10 శాతం వార్షిక రాబడి లభిస్తే, 60 ఏళ్ల వయస్సులో ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్లు ఉంటాయి. దీని నుంచి దంపతులకు నెలకు దాదాపు రూ.45,000 పెన్షన్ అందనుంది.
జాతీయ పెన్షన్ పథకంలో 21 ఏళ్ల వయస్సులో ప్రతి నెలా రూ.3,475 పెట్టుబడి పెడితే, 60 ఏళ్ల రిటైర్‌మెంట్ వయస్సు వచ్చేసరికి ప్రతి నెలా రూ.40,000 పెన్షన్ లభిస్తుంది. 21 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే, రిటైర్‌మెంట్ వయస్సు 60 ఏళ్లు అంటే 39 ఏళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెలా రూ.3,475 ఇన్వెస్ట్ చేస్తే.. రూ.16,26,300 అవుతుంది. రాబడి 10 శాతంగా ఉంటుందని భావిస్తే ఆ వ్యక్తి రిటైర్‌మెంట్ వయస్సు వచ్చేసరికి మొత్తం డబ్బు రూ.2,00,19,029కి జమ అవుతుంది.
రిటైర్‌మెంట్ వయస్సు వచ్చినప్పుడు, పెట్టుబడిలో 60 శాతాన్ని లంప్‌సమ్‌గా తీసుకోవచ్చు. మిగిలిన 40శాతం డబ్బును పెన్షన్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ 40శాతం డబ్బును ప్రభుత్వం డెట్ ఫండ్స్ లేదా కార్పొరేట్ బాండ్స్‌లో పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది. పెన్షన్‌పై 6శాతం వార్షిక రాబడి వస్తుంది అనుకుందాం. అలా అయితే పెన్షన్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.80,07,612 అవుతుంది, మంత్లీ పెన్షన్ రూ.40,038గా లభిస్తుంది.