iDreamPost
android-app
ios-app

ఆడపిల్ల భవిష్యత్తు కోసం సూపర్ స్కీం.. పెళ్లినాటికి చేతికి 27 లక్షలు

మీరు మీ కూతురు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఓ అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. ఈ పథకంలో రోజుకు 121 పొదుపు చేస్తే చేతికి 27 లక్షలు అందుకోవచ్చు.

మీరు మీ కూతురు కోసం పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఓ అద్భుతమైన స్కీం అందుబాటులో ఉంది. ఈ పథకంలో రోజుకు 121 పొదుపు చేస్తే చేతికి 27 లక్షలు అందుకోవచ్చు.

ఆడపిల్ల భవిష్యత్తు కోసం సూపర్ స్కీం.. పెళ్లినాటికి చేతికి 27 లక్షలు

పొదుపు అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాల్సిందే. సంపాదనలో కొంత మొత్తాన్ని ఏదో ఒక రూపంలో పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ఆర్థిక పరమైన సమస్యల నుంచి గట్టెక్కొచ్చు. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో చెప్పలేము. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగాలకు చెందిన స్కీముల్లో పెట్టుబడి పెడితే రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్స్స్ పొందొచ్చు. పోస్టాఫీస్, ఎల్ఐసీ వంటి సంస్థలు అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల కోసం సూపర్ స్కీమ్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఆడపిల్ల భవిష్యత్ కోసం అదిరిపోయే స్కీమ్ ను అందిస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. రోజుకు 21 పొదుపు చేస్తే చాలు ఏకంగా చేతికి 27 లక్షలు వస్తాయి.

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా దిగ్గజం ఎల్ ఐసీ దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది ఎల్ఐసీ. కాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆడపిల్లల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. అదే కన్యాదాన్ పాలసీ. ఈ పథకంలో ప్రతి రోజు 121 పొదుపు చేస్తే చాలు మీరు 27 లక్షలు పొందొచ్చు. అంటే మీరు నెలకు రూ.3630 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ మెచ్యూరిటీ పీరియడ్‌ 25 సంవత్సరాలు. పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత మీరు రూ.27 లక్షలు అందుకుంటారు. ఈ డబ్బు ఆడపిల్ల విద్య, వివాహం వంటి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకుండా ఆదుకుంటాయి. ఆడిపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడిపెడితే కూతురు భవిష్యత్ బంగారుమయంగా మారుతుంది.

ఈ పథకంలో రోజువారీ ప్రీమియం రూ.75తో ప్రారంభమవుతుంది. నెలవారీగా, మూడు నెలలు, ఆరు నెళ్లకు ప్రీమియం చెల్లించే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని 13 నుంచి 25 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌కి తీసుకోవచ్చు. అలానే పాలసీ హోల్డర్ తండ్రి కనీస వయస్సు 30 సంవత్సరాలు, కుమార్తెకు కనీసం ఒక సంవత్సరం వయస్సు ఉండాలి. మెచ్యూరిటీ సమయానికంటే ముందే పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే, కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుంచి రూ.10 లక్షల వరకు అందుకుంటారు. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు అందిస్తుంది.