P Venkatesh
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను అందిస్తోంది. నెలకు 36 కడితే చాలు 2 లక్షలు పొందొచ్చు. అర్హులు ఎవరంటే?
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను అందిస్తోంది. నెలకు 36 కడితే చాలు 2 లక్షలు పొందొచ్చు. అర్హులు ఎవరంటే?
P Venkatesh
వ్యక్తిగతంగా, కుటుంబానికి భద్రత కల్పించాలంటే జీవిత బీమా చక్కని పరిష్కార మార్గం. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి చాలా మంది ఇంట్రెస్టు చూపిస్తున్నారు. బీమా కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పలు ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అయితే బీమా కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో బీమా తీసుకునేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా తక్కువ మొత్తంలో చెల్లించి రెండు లక్షల ప్రయోజనాలను పొందొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంలో చేరితే భారీ ప్రయోజనం పొందొచ్చు.
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను తీసుకొస్తుంది. అయితే ఈ పథకాల పట్ల సరైన అవగాహన లేక చాలా మంది లబ్ధి పొందలేక పోతున్నారు. ప్రమాదాల భారిన పడినప్పుడు జీవిత బీమా చేయించుకుని ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు. కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో నెలకు 36 చెల్లిస్తే 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందొచ్చు. పీఎంజేజేబీవై ప్రస్తుత ప్రీమియం ఏడాదికి రూ.436గా ఉంది. అంటే.. నెలకు రూ.36 చొప్పున చెల్లించాలి.
పీఎంజేజేబీవై పథకంలో చేరేందుకు 18-50 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఏడాది కాలపరిమితితో వస్తుంది. ప్రతి ఏడాది ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం మీకు అవసరం లేదనుకుంటే బ్యాంకుకు వెళ్లి రద్దు చేయించుకోవచ్చచు. జన్ ధన్ ఖాతాదారులకు కూడా ఇందులో చేరొచ్చు. ఈ పథకంలో చేరే వారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్ గా బ్యాంకులు తీసుకునేందుకు అనుమతించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కు ప్రీమియం కట్ అయ్యే సమయంలో అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే బీమా పాలసీ రద్దవుతుంది. ఈ పథకంలో చేరిన బీమాదారుడు ఏదైనా కారణంతో మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల బీమా అందిస్తారు. ఇంత తక్కువ ప్రీమియంతో 2 లక్షల బీమా పథకం ఏ పథకంలో ఉండదనే చెప్పొచ్చు.