P Venkatesh
Post Office Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. లక్షల్లో లాభం అందుకోవచ్చు.
Post Office Recurring deposit scheme: మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. లక్షల్లో లాభం అందుకోవచ్చు.
P Venkatesh
అవసరాలకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే ఆ ధైర్యమే వేరు. డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా డబ్బు అవసరం. అందుకే ప్రతి ఒక్కరు మనీ సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. డబ్బును సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. డబ్బు సంపాదనకు అనేక మార్గాలున్నాయి. ఉద్యోగాలు, బిజినెస్ లు చేస్తూ ఆదాయం పొందొచ్చు. డబ్బును డబ్బే సంపాదిస్తుంది. మీరు ఈ రోజు పొదుపు చేస్తే రేపటి రోజున అది మిమ్మల్ని కాపాడుతుంది. మీ భవిష్యత్ ఆర్థికావసరాలను తీరుస్తుంది. పెట్టుబడి పెట్టగా వచ్చిన సొమ్ముతో పిల్లల చదువులు, పెళ్లిల్లు, సొంతింటి కల ఇలా ఏదైనా నెరవేర్చుకోవచ్చు.
పెట్టుబడికోసం స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే పెట్టుబడి ఎప్పుడు సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టి లాభాలు అందుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు పోస్టాఫీస్ నుంచి మతిపోగొట్టే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో రోజుకు రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి ఏకంగా 17 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.. రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రభుత్వ స్కీమ్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు. మీరు ఈ స్కీమ్‌లో చేరి 17 లక్షల రూపాయలు పొందాలనుకుంటే.. పెట్టుబడి నెలకు రూ. 10 వేలు పెట్టాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కాబట్టి ఈ సమయానికి మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.7 లక్షల 13వేలు అవుతుంది. అయితే మీరు మరో 5 సంవత్సరాలు పొడిగించారని అనుకుంటే అప్పుడు 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై వచ్చే వడ్డీ రూ. 5 లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు పొందొచ్చు.