iDreamPost
android-app
ios-app

LIC బెస్ట్ స్కీమ్.. ఒకసారి కడితే చాలు.. జీవితాంతం నెలకు 12 వేలు పొందొచ్చు

LIC Saral pension Scheme: మీరు నెల నెలా ఆదాయం వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఒకసారి కడితే జీవితాంతం నెలకు 12 వేలు పొందొచ్చు.

LIC Saral pension Scheme: మీరు నెల నెలా ఆదాయం వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఒకసారి కడితే జీవితాంతం నెలకు 12 వేలు పొందొచ్చు.

LIC బెస్ట్ స్కీమ్.. ఒకసారి కడితే చాలు.. జీవితాంతం నెలకు 12 వేలు పొందొచ్చు

ప్రస్తుత రోజుల్లో ఆదాయం మూరెడు, ఖర్చులేమో బారెడు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడం, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కలిపి తడిసిమోపెడవుతున్నాయి. అందుకే చాలా మంది అదనపు ఆదాయాన్ని కోరుకుంటున్నారు. జాబ్ చేస్తూనే మరో వైపు వ్యాపారం చేస్తూ డబుల్ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కొంతమంది ఉన్న డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టి లాభాలను అందుకోవాలని చూస్తున్నారు. మరి మీరు కూడా ప్రతి నెల అదనపు ఆదాయం వస్తే వస్తే బాగుండని ఆలోచిస్తున్నారా? ఇలాంటి వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ స్కీమ్ అందిస్తున్నది. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం నెలకు రూ. 12 వేల పెన్షన్ పొందొచ్చు.

ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ రకరకాల ప్లాన్స్ ను తీసుకొస్తుంది. ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. మంచి లాభాలను అందుకోవచ్చు. ఎల్ఐసీ అందించే పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యెజన్ ఒకటి. ఇందులో ఒకసారి కడితే చాలు 40 ఏళ్ల నుంచి జీవితాంతం పెన్షన్ పొందొచ్చు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ఈ పాలసీలో చేరాలనుకునే వారు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు వారు అర్హులు. అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది.

LIC Scheme

ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినీకి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం వస్తుంది. ఈ పాలసీని రెండు రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు. మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందుతుంది. మరణానంతరం పెట్టుబడి సొమ్మును భార్యకు లేదా నామినీకి అందిస్తారు. రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్.. దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ రావడంతో పాటు అతని మరణానంతరం జీవిత భాగస్వామికి పెన్షన్ ప్రారంభమవుతుంది. వీరి మరణానంతరం నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు.

నెలకు రూ. 12 వేల పెన్షన్

సరళ్ పెన్షన్ యెజనలో రూ. 10 లక్షల సింగిల్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టవచ్చు. అప్పుడు మీరు ప్రతి సంవత్సరం రూ.50,250 పొందుతారు. అంటే మీరు ప్రతి నెలా రూ.4,187 పెన్షన్ అందుకుంటారు. అదే 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి రూ.30 లక్షల పెట్టి ఈ సరళ్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే, ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు రూ.12,388 వరకు పెన్షన్ వస్తుంది. సరళ్ పెన్షన్ యెజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో చేరొచ్చు.