P Venkatesh
Post office time deposit scheme: పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈపథకంలో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 10 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?
Post office time deposit scheme: పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈపథకంలో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 10 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?
P Venkatesh
దేశ ప్రజల కోసం పోస్టల్ శాఖ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నది. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలను అందుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో కళ్లు చెదిరే రాబడిని మీ సొంతం చేసుకోవచ్చు. అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని స్కీమ్స్ ను తీసుకొస్తున్నది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్ స్కీమ్, మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర ఇలా పలు రకాల స్కీమ్ లను పోస్టాఫీస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పోస్టాఫీస్ పథకాల్లో అధిక వడ్డీని అందిస్తున్నది. మీరు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ రూపంలోనే లక్షల్లో ఆదాయం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వార్యంలో అమలవుతుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు.
గ్యారంటీ రిటర్న్స్ మీ సొంతం చేసుకోవచ్చు. మీ పెట్టుబడి ఎల్లప్పుడు సురక్షితంగా ఉంటుంది. మరి మీరు కూడా పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మతిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో పెట్టుబడిపెడితే వడ్డీ రూపంలోనే లక్షల్లో లాభం అందుకోవచ్చు. ఇది సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్. ఈ పథకంలో 5 లక్షల పెట్టుబడి పెడితే ఏకంగా చేతికి 10 లక్షలు వస్తాయి. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకంలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల చొప్పున మెచ్యూరిటీ టైమ్ పీరియడ్స్ ఉంటాయి.
సింగిల్ అకౌంట్ తెరవొచ్చు. లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఐదేళ్ల డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టం- 1961, సెక్షన్ 80c కింద టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల పన్ను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఏడాది టైమ్ డిపాజిట్ పై 6.9 శాతం వడ్డీ, రెండేళ్ల టైమ్ డిపాజిట్లకు 7.0. శాతం, మూడేళ్లకు 7.1 శాతం, ఐదేళ్లకు 7.5 శాతం వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి.
వీటిల్లో ఐదేళ్ల టైమ్ పిరియడ్ కు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే.. 7.5 శాతం వడ్డీ రేటుతో వడ్డీ రూపంలో రూ. 2 లక్షల 24 వేల 974 అందుతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 7 లక్షల 24 వేల 149 పొందొచ్చు. అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే రూ. 2 లక్షల 24 వేల 974 చేతికి అందుతుంది. ఈ మొత్తాన్ని తీయకుండా మరో ఐదేళ్లు పొడిగించుకున్నట్లైతే 10 సంవత్సరాలలో మీరు రూ.5 లక్షల 51 వేల 175 వడ్డీ ఆదాయం పొందుతారు. 10 సంవత్సరాల్లో మీకు రూ.10 లక్షల 51 వేల 175 చేతికి అందుతాయి. పెట్టుబడిపై మంచి రాబడి కావాలనుకునే వారు టైమ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.