iDreamPost
android-app
ios-app

ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరితే 10 లక్షలు మీవే.. ఏడాదికి రూ.555 కడితే చాలు

Post Office Health Insurance: మీరు భారీ ప్రయోజనాలు అందించే బీమా పథకాాల్లో చేరాలనుకుంటే ఇటీవల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇందులో ఏడాదికి రూ.555 కడితే చాలు రూ.10 లక్షల పొందొచ్చు.

Post Office Health Insurance: మీరు భారీ ప్రయోజనాలు అందించే బీమా పథకాాల్లో చేరాలనుకుంటే ఇటీవల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇందులో ఏడాదికి రూ.555 కడితే చాలు రూ.10 లక్షల పొందొచ్చు.

ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరితే 10 లక్షలు మీవే.. ఏడాదికి రూ.555 కడితే చాలు

పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అదిరిపోయే స్కీమ్ లను తీసుకొస్తున్నది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా అధిక ప్రయోజనాలను అందిస్తున్నది. మహిళల కోసం, చిన్నారుల కోసం వినూత్నమైన పథకాలను అమలు చేస్తున్నది. పోస్టాఫీస్ అందిచే పథకాల్లో మంచి వడ్డీ రేటును అందిస్తున్నది. పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ పొందొచ్చు. అయితే సేవింగ్ స్కీమ్స్ తో పాటు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సరికొత్త బీమా పథకాలను కూడా తీసుకొస్తున్నది. ఇటీవల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది భారతీయ పోస్ట్ పేమెంట్ బ్యాంక్. ఇందులో ఏడాదికి రూ.555 కడితే చాలు రూ.10 లక్షల పొందొచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాలైన హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ స్కీమ్స్ లాంచ్ చేసింది. ఈ పథకాల కాల వ్యవధి ఒక సంవత్సరం. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు వారు హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ప్లస్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పాలసీల్లో చేరొచ్చు. తక్కువ ప్రీమియంతోనే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ప్రమాదాల భారిన పడినప్పుడు వైద్య ఖర్చులు ఎక్కువగా అవుతుంటాయి. బీమా పాలసీలు ఉన్నట్లైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన సంస్థలు బీమా పాలసీలను అందిస్తున్నాయి.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించే హెల్త్ ప్లస్ స్కీమ్ లో సంవత్సరానికి రూ. 355 చెల్లిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. ఈ పాలసీ ద్వారా వ్యక్తి ప్రమాదంభారిన పడినప్పుడు.. మరణించినా, శాశ్వత అంగ వైకల్యం పొందినా 100 శాతం సమ్ ఇన్‌ష్యూర్డ్ అందిస్తారు. అలాగే పిల్లల పెళ్లి కోసం రూ.50 వేల వరకు చెల్లిస్తారు. అలాగే ఎముకలు విరిగినట్లయితే రూ.25 వేలు ఇస్తారు. హెల్త్ ప్లస్ రెండో ఆప్షన్ లో ఏడాదికి రూ.555 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో రూ.10 లక్షల బీమా పొందొచ్చు. పాలసీదారు మరణించినా, శాశ్వత అంగవైకల్యం చెందినా 100 శాతం చెల్లిస్తారు. ఎముకలు విరిగినప్పుడు రూ.25 వేలు ఇస్తారు. అంత్య క్రియల కోసం రూ.5 వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువు కోసం రూ.50 వేల వరకు పొందవచ్చు.