P Venkatesh
LIC Aadhaar Shila Yojana: మీరు మంచి లాభాలను ఇచ్చేే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో రోజుకు 29 పెట్టుబడిపెడితే చాలు చేతికి 4 లక్షలు వస్తాయి.
LIC Aadhaar Shila Yojana: మీరు మంచి లాభాలను ఇచ్చేే పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. ఈ పథకంలో రోజుకు 29 పెట్టుబడిపెడితే చాలు చేతికి 4 లక్షలు వస్తాయి.
P Venkatesh
కుటుంబ భద్రతా కోసం, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకూడదంటే ఎంతో కొంత పొదుపు చేయాల్సి ఉంటుంది. సంపాదించిన సొమ్ములో కొంత మోత్తాన్ని సేవ్ చేసినట్లైతే ఫ్యూచర్ లో ఏ చింతా లేకుండా జీవించొచ్చు. ప్రస్తుత రోజుల్లో డబ్బుకు విలువ పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరు ఆదాయమార్గాలపై దృష్టిపెడుతున్నారు. మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన పథకం అండుబాటులో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సూపర్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో రోజుకు 29 పెట్టుబడిపెడితే చేతికి 4 లక్షలు వస్తాయి.
ఎల్ఐసీ దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతూ ఉంటుంది. అయితే ప్లాన్స్ తో పాటు పలు సేవింగ్ స్కీమ్స్ ను కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోజన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది మహిళల కోసం తీసుకొచ్చిన పథకం. ఆధార్ శిలా యోజన అనేది సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్. ఆధార్ కార్డు కలిగిన మహిళలు ఈ పాలసీలో చేరొచ్చు. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు గల మహిళలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.75,000, గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీమ్ కనీస మెచూరిటీ టైమ్ 10 ఏళ్లుగా ఉండగా.. గరిష్ఠ వ్యవధి 20 ఏళ్లు. మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడి మొత్తాన్ని, బోనస్‌తో కలిపి తిరిగి చెల్లిస్తుంది.
బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు. ఎల్ఐసీ ప్రవేశపెట్టిన ఆధార్ శిలా యోజన పథకంలో 30 ఏళ్ల వయసు ఉన్న మహిళ 20 ఏళ్ల పాటు రోజుకు రూ.29 పెట్టుబడి పెడితే.. రూ.2,11,170 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు అందుకోవచ్చు. అంటే పెట్టుబడి నుంచి రూ.1.88 లక్షల లాభాన్ని పొందొచ్చు. మరి మీరు కూడా పెట్టుబడిపై మంచి లాభాలను అందుకోవాలనుకుంటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని అంటున్నారు నిపుణులు.